Share News

ప్లేయర్లు ఆడొద్దని బోర్డు చెప్పడం సమంజసం కాదు: కపిల్ దేవ్

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:18 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పు బట్టాడు. వారి ప్లేయర్లకు వారే అన్యాయం చేస్తున్నారని అన్నాడు.

ప్లేయర్లు ఆడొద్దని బోర్డు చెప్పడం సమంజసం కాదు: కపిల్ దేవ్
Kapil Dev

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మాత్రం ఇప్పుడే కాదు ఇంకేప్పుడు మ్యాచులు ఆడబోమని పీసీబీ ప్రకటించింది. దీనిపై ఐసీసీ తీవ్రంగా స్పందించి పాకిస్థాన్ బోర్డును హెచ్చరించినా.. ఆ దేశం మొండి వైఖరినే ప్రదర్శిస్తోంది. గ్రూప్ స్టేజిలో భారత్-పాక్ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev) తప్పు బట్టాడు.


‘ఒకవేళ ఈ నిర్ణయం ఆటగాళ్లు తీసుకుంటే వాళ్లు ముందకు వచ్చి చెప్పొచ్చు. కానీ ఆటగాళ్లు ఆడకూడదని బోర్డు నిర్ణయం తీసుకుంటే దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఈ నిర్ణయం పాక్ ప్రగతికి ఏ మాత్రం దోహదపడదు. వారు పాక్ క్రికెట్‌ను చంపేస్తున్నారు. ప్రపంచ కప్ ఆడకుండా క్రికెటర్లను అడ్డుకోవడం సమంజసం కాదు. వారి సొంత ఆటగాళ్లకే వారు అన్యాయం చేసినట్లవుతుంది’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.


ఒకవేళ గ్రూప్ స్టేజిలో పాక్.. భారత్‌తో మ్యాచ్ ఆడకుంటే నెట్ రన్ రేట్ పరంగా వెనకబడుతుంది. మ్యాచ్ పాయింట్లు కూడా భారత్‌కు వస్తాయి. దీంతో మెగా టోర్నీలో పాక్ ముందుకుసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరంగానూ పాక్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ వైఖరినే కొనసాగిస్తే పాక్.. ఐసీసీ నుంచి నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.


ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 04 , 2026 | 12:18 PM