Share News

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:43 AM

టీ20 ప్రపంచ కప్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం భారత జట్టుకు ఉందని ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. సన్నాహక మ్యాచుల్లో విశ్వరూపం చూపించిన టీమిండియా.. అత్యంత ప్రమాదకరమైన జట్టు అని నిరూపించుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం భారత జట్టుకు ఉందని ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.


‘అత్యంత ప్రమాదకరమైన జట్లలో టీమిండియా(Team India) ఒకటి. మంచి జట్టుకు ఏమేం కావాలో.. అవన్నీ ప్రస్తుత జట్టులో ఉన్నాయి. జట్టులోని సభ్యులకు అపార అనుభవం ఉంది. ఈ ఫార్మాట్లో అదే అత్యంత కీలకం. వారు ఒత్తిడిని తట్టుకోగలరు. ఎవరు ఎలాంటి పాత్రలు పోషించాలో వారికి బాగా తెలుసు. అయితే ఒక్క విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. అదే డ్యూ(మంచు). అది నన్ను ఆందోళనకు గురి చేసే అంశం. డ్యూ అంటే నాకు అస్సలు నచ్చదు. అది చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. నేను ఆడుతున్న సమయంలోనూ డ్యూ అంటే నేను భయాందోళకు గురయ్యేవాడిని. ఇలాంటి సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని ధోని వివరించాడు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

టీ20 ప్రపంచ కప్ 2026.. అతడు టీమిండియాకు కీలకం అవుతాడు: రికీ పాంటింగ్

Updated Date - Feb 04 , 2026 | 11:44 AM