Home » MS Dhoni
Shai Hope: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి దాదాపు నాలుగేళ్లు దాటుతున్నా అతడి క్రేజ్ తగ్గలేదు. తాజాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ చెప్పిన సలహా వల్లే తాము ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో గెలిచామని చెప్పాడు.
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది మోకాలికి ఆపరేషన్ చేయించుకున్న ధోనీ వచ్చే సీజన్ ఆడాలంటే అందుకు తగ్గట్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తనకు తెలిసినంతవరకు ధోనీ సీజన్ మొత్తం ఆడే అవకాశాలు లేవని కుంబ్లే స్పష్టం చేశాడు. వచ్చే సీజన్లో ధోనీ ఆడటం డౌటేనని.. అతడు ఎప్పుడు జట్టు వీడతాడో ఎవరూ అంచనా వేయలేరని పేర్కొన్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేక చోటు ఉంది. కెప్టెన్‌గా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడు. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాల వైపు తీసుకెళ్లిన స్ఫూర్తిదాయక సారథి.
వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీస్ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అతిథ్య జట్టు టీమిండియా, గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. సెమీస్ పోరు కోసం ఐసీసీ, మ్యాచ్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాయి. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.
మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. కెప్టెన్ కూల్. భారత్‌కు మూడు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికి చాలా రోజులు గడిచిన ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు నిదర్శనం తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారతే కావడం విశేషం. ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచి మొత్తం 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ క్రీజులోకి వచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన ఓ రికార్డును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ అధిగమించాడు. 44 ఏళ్ల వయసులో ఫ్రాంచైజీ లీగ్ టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా అతడు తన పేరును లిఖించుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతడిని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించాడు. దీంతో ట్రంప్ నివాసానికి వెళ్లిన ధోనీ ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. అంతేకాకుండా సరదాగా కాసేపు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ధోనీ, ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని రికార్డులను యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ బద్దలుకొట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 82 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.