Share News

Robin Uthappa: ధోనికి ఇదే చివరి ఐపీఎల్.. రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 17 , 2025 | 07:59 AM

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు అని చెప్పుకొచ్చాడు. అందుకే టీమ్‌కి యాజమాన్యం యువ ప్లేయర్లను తీసుకున్నట్లు వెల్లడించాడు.

Robin Uthappa: ధోనికి ఇదే చివరి ఐపీఎల్.. రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ.. ఆయన్ను చూస్తే చాలు అనుకునేవాళ్లు కొంతమంది. ఏదో ఒక ఫార్మాట్.. ఆడితే చాలు అనుకునేవాళ్లు మరికొంత మంది. ప్రతి ఐపీఎల్ సీజన్ చివర్లో.. అభిమానుల గుండెల్లో ఓ గుబులు.. మాహీ ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతాడా? అని. ధోనీ కూడా ఏం తక్కువ కాదు, మోకాళ్ల నొప్పి వేధిస్తున్నా.. వికెట్ల మధ్య పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నా.. తమ అభిమానుల కోసమే అన్నట్టుగా ప్రతి ఐపీఎల్‌కు సిద్ధమవుతుంటాడు. ఈ సారి కూడా తాను ఐపీఎల్ ఆడతున్నట్లు ఏదో రకంగా హింట్లు ఇస్తూ వస్తాడు. క్రీజులో నిలబడి భారీ షాట్లు కొట్టాలన్నా.. సెకండ్లలో స్టంప్స్ పడగొట్టాలన్నా మాహీనే కావాలి. ధోనీ బ్యాటింగ్‌కి రాకపోయినా పర్వాలేదు.. జట్టులో ఉంటే చాలు అని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో పాటు ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.


ఈ నేపథ్యంలో ఓ అలజడి సృష్టించే వార్త ఒకటి వినిపిస్తుంది. ధోనీ(MS Dhoni) ఐపీఎల్ కెరీర్ విషయంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పరిస్థితులను చూస్తుంటే ధోనీకిదే చివరి సీజన్‌ (ఐపీఎల్ 2026) అవ్వొచ్చు. ఆపై ఎడిషన్‌ ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఐపీఎల్‌ మినీ వేలంలో సీఎస్కే ఎక్కువగా యువ క్రికెటర్లపై ఇన్వెస్ట్ చేసింది. గత ఏడాది కూడా అదే చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వంటి టాలెంట్ కలిగిన యువ క్రికెటర్లను ఫ్రాంచైజీతో ఉంచుకుంది. ధోనీ మరిన్ని సీజన్లు ఆడకపోవచ్చనే దానికి ఇది సూచిక. క్రికెటర్‌గా ఆడకపోయినా సీఎస్కేకు మెంటార్‌గా వస్తాడు. వచ్చే సీజన్‌లోనే ప్లేయర్ కమ్ మెంటార్‌ అవుతాడని అనుకుంటున్నా. అతడు చూసే దృక్కోణం కూడా అలానే ఉంది’ అని రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

Abhijnaan Kundu: అభిజ్ఞాన్‌ కుందు డబుల్‌ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్

Updated Date - Dec 17 , 2025 | 07:59 AM