IPL auction 2026: అన్‌క్యాప్‌డ్ ఆల్ రౌండర్లకు డిమాండ్.. భారీ ధర పలికిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ
ABN , Publish Date - Dec 16 , 2025 | 09:01 PM
ఐపీఎల్-2026 మినీ వేలంలో పలువురు అన్‌క్యాప్‌డ్ ఆల్ రౌండర్లు జాక్‌పాట్ కొట్టారు. పలువురు ఆటగాళ్లు వేలంలో భారీ ధర దక్కించుకున్నారు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కోసం ముంబై, లఖ్‌నవూ, చెన్నై, రాజస్థాన్ పోటీపడ్డాయి.
ఐపీఎల్-2026 మినీ వేలంలో పలువురు అన్‌క్యాప్‌డ్ ఆల్ రౌండర్లు జాక్‌పాట్ కొట్టారు. పలువురు ఆటగాళ్లు వేలంలో భారీ ధర దక్కించుకున్నారు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కోసం ముంబై, లఖ్‌నవూ, చెన్నై, రాజస్థాన్ పోటీపడ్డాయి. దీంతో ప్రశాంత్ ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు ప్రశాంత్‌ను రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది (uncapped player IPL).
ప్రశాంత్ వీర్ తర్వాత కార్తీక్ శర్మ కూడా అనూహ్యంగా భారీ ధర దక్కించుకున్నాడు. కార్తీక్ శర్మ కోసం కేకేఆర్, చెన్నై, హైదరాబాద్ పోటీ పడ్డాయి. చివరకు కార్తీక్‌ను చెన్నై దక్కించుకుంది. కార్తీక్‌ను రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. అలాగే మరో అన్ క్యాప్‌డ్ ప్లేయర్ ఆకిబ్ దార్‌ను ఢిల్లీ రూ.8.40 కోట్లకు దక్కించుకుంది. ఇక, గత కొన్ని సీజన్లుగా సీఎస్కేకు ఆడుతున్న బౌలర్ మతీశ పతిరనకు కూడా జాక్‌పాట్ తగిలింది (IPL 2026 auction highlights).
మతీశ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో తాజా వేలంలోకి వచ్చాడు (IPL auction news). అతడి కోసం మొదట్లో ఢిల్లీ, లఖ్‌నవూ పోటీ పడ్డాయి. చివరకు అతడిని కేకేఆర్ రూ.18 కోట్లకు దక్కించుకుంది. అలాగే భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రూ.7.2 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియాను లఖ్‌నవూ రూ.2 కోట్లకు, న్యూజిలాండ్ బ్యాటర్ జాకబ్ డఫీని రూ.2 కోట్లకు ఆర్సీబీ, విండీస్ ప్లేయర్ అకీల్ హుస్సేన్‌ను రూ.2 కోట్లకు చెన్నై కోనుగోలు చేశాయి.
ఇవి కూడా చదవండి:
Abhijnaan Kundu: అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్