Abhijnaan Kundu: అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:04 PM
అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ చేశాడు. దీంతో అండర్ 19లో ద్విశతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా ఈ 17 ఏళ్ల కుర్రాడు రికార్డు క్రియేట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యంగ్ ప్లేయర్ అభిజ్ఞాన్ కుందు(Abhijnaan Kundu) అరుదైన రికార్డు సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్ లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో అతడి ఖాతాలో అరుదైన రికార్డును నమోదు చేశాడు. అండర్ -19 చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా అభిజ్ఞాన్ కుందు నిలిచాడు. మంగళవారం దుబాయ్ వేదికగా భారత్, మలేషియా మధ్య మ్యాచ్(India vs Malaysia) జరుగుతుంది. అభిజ్ఞాన్ విధ్వంసంతో మలేషియా ముందు 409 పరుగుల భారీ టార్గెట్ ను భారత్ ఉంచింది.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, మలేషియా జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మలేషియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. యూత్ వన్డేల్లో భారత్ కు ఇది మూడో అత్యధిక స్కోర్. అభిజ్ఞాన్ కుందు 121 బంతుల్లోనే డబుల్ సెంచరీతో మలేషియా బౌలర్లపై విరుచుక పడ్డాడు. చివరికి 125 బంతుల్లో, 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 209 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు.
వేదాంత్ త్రివేది (90), వైభవ్ సూర్యవంశీ (50) రాణించారు. మలేషియా బౌలర్లలో మహ్మద్ అక్రమ్ 5, ఎన్.సత్నకుమారన్, జాశ్విన్ కృష్ణమూర్తి తలో వికెట్ తీసుకున్నారు. యూత్ వన్డేల్లో(అండర్-19) దక్షిణాఫ్రికాకు చెందిన జోరిచ్ వాన్ షాల్క్విక్ 2025లో జింబాబ్వేపై 153 బంతుల్లో 215 పరుగులు రాబట్టాడు. ఏ బ్యాటర్‌కైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. తాజా ఇన్నింగ్స్‌తో అభిజ్ఞాన్ కుందు (209*) రెండో స్థానంలో నిలిచాడు.
అండర్-19 వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
జోరిచ్ వాన్ షాల్క్‌విక్(215) (దక్షిణాఫ్రికా) vs జింబాబ్వే (జూలై, 2025)
అభిజ్ఞాన్ కుండు(209*) (భారత్) vs మలేషియా (డిసెంబర్, 2025)
హసిత బోయగోడ(191) (శ్రీలంక) vs కెన్యా (జనవరి, 2018)
జాకబ్ భూలా(180) (న్యూజిలాండ్) vs కెన్యా (జనవరి, 2018)
థియో డోరోపౌలోస్(179*) (ఆస్ట్రేలియా) vs ఇంగ్లాండ్ (ఫిబ్రవరి, 2023)
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్
జట్టుకు సీఈవోలా ఫీలవ్వకూడదు.. గంభీర్‌కు హర్ష భోగ్లే హెచ్చరిక