Share News

Abhijnan Double Century: అభిజ్ఞాన్‌ డబుల్‌ సెంచరీ

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:37 AM

వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన యువ భారత జట్టు అండర్‌-19 ఆసియా కప్‌ సెమీస్‌కు దూ సుకెళ్లింది.....

Abhijnan Double Century: అభిజ్ఞాన్‌ డబుల్‌ సెంచరీ

  • విజృంభించిన దీపేష్‌

  • సెమీ్‌సకు యువ భారత్‌

  • 315 రన్స్‌తో మలేసియా చిత్తు

దుబాయ్‌: వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన యువ భారత జట్టు అండర్‌-19 ఆసియా కప్‌ సెమీస్‌కు దూ సుకెళ్లింది. అభిజ్ఞాన్‌ కుందు (125 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 209 నాటౌట్‌) ద్విశతకంతో అదరగొట్టగా.. దీపేష్‌ దేవేంద్రన్‌ (5/22) నిప్పులు చెరిగాడు. దీంతో గ్రూప్‌-ఎలో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 315 పరుగుల తేడాతో మలేసియాను చిత్తు చేసింది. 3 మ్యాచ్‌ల నుంచి 6 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా భారత్‌ నాకౌట్‌కు చేరుకోగా.. మలేసియా టోర్నీ నుంచి అవుటైంది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 408 పరుగులు చేసింది. వేదాంత్‌ త్రివేది (90), వైభవ్‌ సూర్యవంశీ (50) హాఫ్‌ సెంచరీలు చేశారు. మహ్మద్‌ అక్రమ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో మలేసియా 32.1 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. హమ్జా పంగీ (35) టాప్‌ స్కోరర్‌. యూత్‌ వన్డేల్లో భారత్‌ తరఫున అభిజ్ఞాన్‌ అత్యధిక స్కోరు నమోదు చేయగా.. భారత 315 పరుగుల గెలుపు యూత్‌ క్రికెట్‌లో రెండో అతి పెద్దది.

Updated Date - Dec 17 , 2025 | 04:37 AM