Share News

IPL 2026: అతడిని తక్కువగా అంచనా వేస్తున్నారు: మాజీ కెప్టెన్ శ్రీకాంత్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 10:18 AM

ఐపీఎల్ 2026 మినీ వేలం మంగళవారం అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సీఎస్కేకు కీలక సూచన చేశాడు. బ్రేస్‌వెల్‌ను వేలంలో దక్కించుకోవాలని సూచించాడు.

IPL 2026: అతడిని తక్కువగా అంచనా వేస్తున్నారు: మాజీ కెప్టెన్ శ్రీకాంత్‌
Michael Bracewell

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026కి సంబంధించిన మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సారి(IPL 2026) రూ.43.40కోట్లతో వేలం బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సీఎస్కేకు ఓ కీలక సూచన చేశాడు.


‘రుతురాజ్ గైక్వాడ్‌, సంజు శాంసన్‌, ఆయుష్‌ మాత్రే, ఉర్విల్‌ పటేల్.. వంటి ఆటగాళ్ల‌తో సీఎస్కే(CSK) టాప్‌–4 బ్యాటింగ్ ఆర్డర్‌ బలంగా ఉంది. బ్యాటింగ్‌పై ఆ జట్టుకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ మిడిల్‌ ఆర్డర్‌కు సమతూకం ఇచ్చే ఆటగాడిగా న్యూజిలాండ్ ప్లేయర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌(Michael Bracewell) అద్భుతమైన ఎంపిక. అతడిని అందరూ తక్కువగా అంచనా వేస్తున్నారు. ఫినిషర్‌గా అతడు జట్టుకు ఎంతో ఉపయోగపడతాడు. ధోనీ లాంటి నాయకుడు ఉంటే బ్రేస్‌వెల్‌ను గొప్ప ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దగలడు’ అని శ్రీకాంత్ వెల్లడించాడు.


వాళ్లంతా వద్దు..

‘రవి బిష్ణోయిని తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే శ్రేయస్‌ గోపాల్‌ ఉన్నాడు. ఇక డేవిడ్‌ మిల్లర్‌ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. చెన్నై పిచ్‌లు అతడికి సరిపోవు. మిల్లర్‌ కంటే బ్రేస్‌వెల్‌ చాలా మేలు’ అని తెలిపాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒకే సీజన్‌ ఆడిన బ్రేస్‌వెల్‌… 2023లో ఆర్సీబీ(RCB) తరఫున ఐదు మ్యాచ్‌ల్లో 58 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. ఈసారి అతడి బేస్‌ ప్రైస్‌ రూ.2 కోట్లు. మరి శ్రీకాంత్‌ సూచనను సీఎస్కే మేనేజ్‌మెంట్‌ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో… మంగళవారం జరిగే వేలంలో తేలనుంది.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ భారీ రికార్డుపై అభిషేక్ శర్మ కన్ను!

మెస్సి టూర్‌లో అరెస్ట్.. ఎవరీ శతద్రు దత్తా?

Updated Date - Dec 14 , 2025 | 10:18 AM