Share News

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్-పాక్ వివాదం.. పీసీబీకి లేఖ రాసిన శ్రీలంక

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:26 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో పాకిస్థాన్ జట్టు ఆడటంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక లేఖ రాసింది.

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్-పాక్ వివాదం.. పీసీబీకి లేఖ రాసిన శ్రీలంక
PCB

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా భారత్‌తో పాకిస్థాన్ జట్టు ఆడటంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ను ఈ మెగా టోర్నీ నుంచి ఐసీసీ తప్పించడంతో ఆ దేశానికి మద్దతుగా ప్రపంచ కప్ నుంచి పాక్ వైదొలగాలనుకుంది. ఆ తర్వాత పాక్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. టోర్నీలో పాల్గొంటామని కానీ భారత్‌తో మాత్రం మ్యాచ్ ఆడబోమని పీసీబీ ప్రకటించింది. అయితే ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026)కి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. పాక్ ఆడాల్సిన మ్యాచులన్నీ శ్రీలంక వేదికగానే ఏర్పాటు చేశారు.


భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ, బ్రాడ్‌కాస్టర్స్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. అలాగే శ్రీలంక క్రికెట్ బోర్డుకూ నష్టమే. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని శ్రీలంక.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు లేఖ రాసింది. తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పీసీబీని కోరింది. అయితే ఈ విషయమై పీసీబీ తమ ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం పీసీబీ నడుచుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా షెడ్యూల్ ప్రకారం పొట్టి ప్రపంచ కప్‌లో గ్రూప్ స్టేజిలో ఇండియా-పాక్ ఫిబ్రవరి 15న కొలంబోలో తలపడాల్సి ఉంది. శ్రీలంక అభ్యర్థనను పరిశీలనలోకి తీసుకుని పాక్ యూటర్న్ తీసుకుంటుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 07 , 2026 | 05:04 PM