టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ఓపెనర్ ఎవరో తేల్చేసిన వార్మప్ మ్యాచ్
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:01 PM
టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే భారత జట్టు తరఫున ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ కన్ఫర్మ అయినట్టే. మరో ఓపెనర్ ఎవరనే ప్రశ్నకు నిన్న(బుధవారం) సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌తో సమాధానం దొరికినట్టైంది.
నవీ ముంబయి వేదికగా బుధవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 వరల్డ్‌కప్(ICC Mens T20 World Cup) వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో అభిషేక్ శర్మకు తోడుగా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. దీంతో ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్(Sanju Samson) వార్మప్ మ్యాచులో ఆడలేదు. అతడి స్థానంలో ఇషాన్ దిగాడు. ఓపెనర్‌గా వచ్చిన కిషన్ కేవలం 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్స్‌లతో 53 పరుగులు సాధించాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఓపెనర్‌గా తన బెర్త్ను సుస్థిరం చేసుకున్నాడు. న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో సరిగ్గా ఆడని సంజూ.. పొట్టి ప్రపంచకప్‌లో ఆడే భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడంలో విఫలమయ్యాడు.
అనూహ్యంగా జట్టులోకి వచ్చి..
ఇషాన్ కిషన్ కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే.. టీ20 ప్రపంచకప్ విషయంలో సెలెక్టర్ల దృష్టిలోనే లేడు. అంతకముందు.. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో జార్ఖండ్ తరఫున అదిరిపోయే ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. న్యూజిలాండ్ సిరీస్‌కు అనూహ్యంగా జట్టులోకి వచ్చిన కిషన్.. ఓపెనర్‌గా సంజూ విఫలమవుతుంటే.. వన్‌డౌన్‌లో వస్తూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 215 పరుగులతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అదే సమయంలో సంజూ శాంసన్ అయిదు టీ20ల్లో కలిపి కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.
ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ ఏకంగా 32 స్థానాలు ఎగబాకి, 32వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దీంతో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమై, ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడనే సంకేతాలు ఈ వార్మప్ మ్యాచ్‌తో వచ్చాయని క్రీడా నిపుణులు అభిప్రాయా పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి..
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ