డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా.. ఢిల్లీ స్కోర్ 203
ABN , Publish Date - Feb 05 , 2026 | 09:19 PM
డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Delhi Capitals vs RCB) తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(57) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అలానే లారా వోల్వార్డ్ట్(44), లిజెల్ లీ(37), చినెల్లే హెన్రీ(35),షఫాలీ వర్మ(20) కూడా రాణించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే, అరుంధతి రెడ్డి, నాడిన్ డి క్లర్క్ తలో వికెట్ సాధించారు.
ఢిల్లీ ఓపెనర్లరు లిజెల్ లీ, షఫాలీ వర్మలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(57) బెంగళూరు బౌలర్లపై విరుచకుపడింది. అయితే 72 పరుగు వద్ద లీ పెవిలియన్ చేరింది. అయినా జెమీమా(Jemimah Rodrigues) తన దూకుడును తగ్గించలేదు. ఈ క్రమంలో లారా వోల్వార్డ్ట్‌తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 148 పరుగుల వద్ద మూడో వికెట్ గా జెమీమా.. సయాలీ బౌలింగ్‌లో నాడిన్ క్లర్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటైంది.
చివర్లో లారా, హెన్రీ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. హెన్రీ 15 బంతుల్లో 35 పరుగులు చేసిందంటే.. ఏ రేంజ్ లో చెలరేగిందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా కప్ కొట్టాలనే కసితో ఢిల్లీ మంచి స్కోర్‌నే బెంగళూరు ముందు ఉంచింది. బెంగళూరు బౌలర్లు ఎవ్వరూ ఆశించిన మేర రాణించలేదు. ఢిల్లీ బ్యాటర్ల వికెట్ తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూసీ-2026: మేము కొలంబో వెళ్తాం: సూర్య కుమార్
టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ఓపెనర్ ఎవరో తేల్చేసిన వార్మప్ మ్యాచ్