WPL 2026: ఇది మేము ఆశించిన ఆరంభం కాదు.. యూపీ వారియర్స్ కెప్టెన్ అసహనం
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:47 AM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. యూపీ వారియర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో యూపీ వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. యూపీ వారియర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్(Meg Lanning) స్పందించింది.
‘ఇది(WPL 2026) మేం ఆశించిన ఆరంభం కాదు. ఒకటి లేదా రెండు విజయాలతో టోర్నీని ప్రారంభించాలనుకున్నాం. ఆర్సీబీ మాపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఈ ఓటమి ద్వారా మేం మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయనే విషయం అర్థమైంది. అయినా ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. మ్యాచులు వెనువెంటనే ఉండటంతో ఈ ఓటమి నుంచి త్వరగానే బయటపడుతాం. బ్యాటింగ్‌లో మేం రాణించలేకపోయాం. ఆర్సీబీ(RCB)తో మేం ఆడింది అస్సలు మా ఆటే కాదు. చాలా ఎక్కువ డాట్ బాల్స్ ఆడాం. అందులో నేనేమీ మినహాయింపు కాదు. ఈ విషయంలో మేం చాలా మెరుగుపడాలి’ అని లానింగ్ వెల్లడించింది.
అవన్నీ వర్కౌట్ కాలేదు..
‘వికెట్ కోసం చాలా శ్రమించాం. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలర్లలో శిఖా పాండే ఒకరు. ఆమె వైవిధ్యంగా బౌలింగ్ చేస్తుంది. కానీ ఈ సారి ఆమె ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు. కానీ మేం పుంజుకుంటాం. గ్రేస్ హారిస్ క్రీజులో సెట్ అయితే ఆమెను ఆపడం చాలా కష్టం. ఆమె పవర్ హిట్టర్. మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడింది. ఆమె దూకుడుకు మేం అడ్డుకట్ట వేయలేకపోయాం’ అని లానింగ్ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
జిమ్‌లో కష్టపడటం కంటే.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే మేలు: పీవీ సింధు