Share News

PV Sindu: జిమ్‌లో కష్టపడటం కంటే.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే మేలు: పీవీ సింధు

ABN , Publish Date - Jan 13 , 2026 | 09:33 AM

ఇటీవలే జరిగిన మలేసియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే గాయం బారిన పడిన సింధు.. సుదీర్ఘ కాలం తర్వాత ఆ టోర్నీతోనే రీఎంట్రీ ఇచ్చింది. ఆటకు దూరమైన నాటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుందో తాజాగా సింధు వివరించింది.

PV Sindu: జిమ్‌లో కష్టపడటం కంటే.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే మేలు: పీవీ సింధు
PV Sindu

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే జరిగిన మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్ వరకు వచ్చి బోల్తా పడిన విషయం తెలిసిందే. లీగ్ అంతా అజేయంగా నిలిచి సెమీస్ మ్యాచులో పరాజయం పాలైంది. అయితే గాయం బారిన పడిన సింధు.. సుదీర్ఘ కాలం తర్వాత ఆ టోర్నీతోనే రీఎంట్రీ ఇచ్చింది. ఆటకు దూరమైన నాటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుందో తాజాగా సింధు(PV Sindu) వివరించింది.


‘ఆటకు అథ్లెట్ దూరమైనప్పుడు ఎన్నో సందేహాలు వేధిస్తాయి. మళ్లీ వంద శాతం ఫిట్‌నెస్‌తో తిరిగి రాగలమా? అనే ప్రశ్నలు మనసులో మెదులుతాయి. అయితే ఆ ప్రశ్నలకు మనమే సమాధానం వెతుక్కున్నప్పుడు మరింత బలంగా తయారవుతాం. కాలు తడబడటంతో బొటన వేలికి గాయమైంది. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతే ఆడాలని నిర్ణయించుకున్నా. 50 శాతం ఫిట్‌నెస్‌తో ఆడి సమస్యలు తెచ్చుకోవడం కంటే పూర్తిగా కోలుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడమే సరైన నిర్ణయమని భావించా. శరీర నిర్వహణపై దృష్టి సారించడం ముఖ్యం. పదేళ్ల కిందటి పద్ధతులు ఇప్పుడు పని చేయకపోవచ్చు. కొన్నిసార్లు జిమ్‌లో కష్టపడటం కంటే విశ్రాంతి తీసుకోవడమే మేలు. విశ్రాంతి సమయంలో మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకున్నా. మలేసియా ఓపెన్‌లో నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ఇదే లయను, ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తా’ అని సింధు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?

నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా

Updated Date - Jan 13 , 2026 | 09:33 AM