Share News

Women Premier League 2026: హ్యారిస్‌ ధనాధన్‌

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:14 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. సోమవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన...

Women Premier League 2026: హ్యారిస్‌ ధనాధన్‌

డబ్ల్యూపీఎల్‌లో నేడు

ముంబై గీగుజరాత్‌ (రా. 7.30)

యూపీపై ఆర్‌సీబీ అలవోక విజయం

నవీ ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. సోమవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఈ జట్టు 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్‌), డియాండ్రా డాటిన్‌ (37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 నాటౌట్‌) ఆదుకున్నారు. శ్రేయాంక, డి క్లెర్క్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 12.1 ఓవర్లలోనే 145/1 స్కోరు చేసి నెగ్గింది. ఓపెనర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ (40 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 85) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (32 బంతుల్లో 9 ఫోర్లతో 47 నాటౌట్‌) రాణించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హ్యారిస్‌ నిలిచింది.

హ్యారిస్‌ బాదుడు: స్వల్ప ఛేదనలో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ రాకెట్‌ వేగంతో సాగింది. ఓపెనర్లు హ్యారిస్‌, మంధాన ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా హ్యారి్‌స ఆరో ఓవర్‌లో 4,6,4,6,6,4 (2వైడ్లు)తో 32 పరుగులు రాబట్టింది. దీంతో డాటిన్‌ ఒకే ఓవర్‌లో ఎక్కువ పరుగులిచ్చుకున్న బౌలర్‌గా స్నేహ్‌ రాణా సరసన నిలిచింది. ఇదే ఓవర్‌లో హ్యారిస్‌ 22 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా.. పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 78 పరుగులతో నిలిచింది. దీనికి తోడు 7.5 ఓవర్లలోనే స్కోరు వందకు చేరడంతో యూపీ ఘోర ఓటమి స్పష్టమైంది. విజయానికి ఏడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు, 12వ ఓవర్‌లో హ్యారిస్‌ వెనుదిరిగింది. అయితే మరో 3 బంతుల్లోనే మంధాన మ్యాచ్‌ను ముగించింది.


ఆదుకున్న దీప్తి, డాటిన్‌: మొదట ఆర్‌సీబీ బౌలర్లు కట్టడి చేయడంతో యూపీ పరుగుల కోసం చెమటోడ్చింది. ఓపెనర్లుగా ఈసారి లానింగ్‌ (14), హర్లీన్‌ (11) బరిలోకి దిగినా ఫలితం లేకపోయింది. శ్రేయాంక ఒకే ఓవర్‌లో లానింగ్‌, లిచ్‌ఫీల్డ్‌లను అవుట్‌ చేయగా.. తర్వాతి ఓవర్‌లో కిరణ్‌ (5), శే ్వత (0)లను డి క్లెర్క్‌ దెబ్బతీసింది. దీంతో 50/5 స్కోరుతో యూపీ కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి, డాటిన్‌ ఆరో వికెట్‌కు అజేయంగా 93 రన్స్‌ జోడించారు. చివరి 2 ఓవర్లలో 26 రన్స్‌ అందించి జట్టు పరువు కాపాడారు.

సంక్షిప్త స్కోర్లు

యూపీ వారియర్స్‌: 20 ఓవర్లలో 143/5 (దీప్తి శర్మ 45 నాటౌట్‌, డాటిన్‌ 40 నాటౌట్‌, లిచ్‌ఫీల్డ్‌ 20; డిక్లెర్క్‌ 2/28, శ్రేయాంక 2/50).

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: 12.1 ఓవర్లలో 145/1. (హ్యారిస్‌ 85, మంధాన 47 నాటౌట్‌; శిఖా పాండే 1/28). డిక్లెర్క్‌ (2/28)

ఇవి కూడా చదవండి:

సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?

నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా

Updated Date - Jan 13 , 2026 | 06:14 AM