Harshit Rana: నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:04 PM
వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ పేసర్ హర్షిత్ రాణా.. అటు బంతితో, ఇటు బ్యాటుతో ఆకట్టుకున్నాడు. ఈ విషయంపై హర్షిత్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ పేసర్ హర్షిత్ రాణా.. అటు బంతితో, ఇటు బ్యాటుతో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్‌లో కివీస్ ఓపెనర్లను పెవిలియన్ పంపిన హర్షిత్ రాణా.. ఛేదనలో కీలక సమయంలో క్రీజులోకి వచ్చి 29 పరుగులు చేశాడు. టీమిండియా గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. అయితే తన ఎంపికపై ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా హర్షిత్‌పై నమ్మకం ఉంచిన సెలక్టర్లు.. అతడిని జట్టులోకి తీసుకుంటూనే ఉన్నారు. రాణా కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా బ్యాటుతోనూ అదరగొడుతున్నాడు. ఈ విషయంపై హర్షిత్(Harshit Rana) మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
‘నేను ఆల్‌రౌండర్‌లా ఎదగాలని టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. నేనూ దాని మీదే కసరత్తు చేస్తున్నాను. నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. నేను మ్యాచులో బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు నా సహచరుల నుంచి మద్దతు లభించింది. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. దీంతో నేను పరుగులు చేయడంపై దృష్టి పెట్టగలిగాను. టీమిండియా(Team India) నేను 8వ స్థానంలో ఆల్‌రౌండర్‌గా వచ్చి బ్యాటింగ్ చేయాలని చూస్తోంది. నేను కూడా క్రీజులోకి దిగితే 30-40 పరుగులు చేయగలనన్న విశ్వాసం నాకుంది. జట్టు మన మీద నమ్మకం ఉంచినప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సీనియర్లు, జూనియర్లు మద్దతుగా నిలుస్తారు’ అని హర్షిత్ రాణా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. ఎవరీ నందని శర్మ?
టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!