Share News

Ind Vs NZ: టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:06 AM

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

Ind Vs NZ: టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!
Ind Vs NZ

ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కనబర్చారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి ఈ సిరీస్ నుంచే దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచులో కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. అతడి బదులు ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో మాత్రం క్రీజులోకి వచ్చిన వాషీ.. ఇబ్బంది పడుతూనే కనిపించాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో సుందర్ బరిలోకి దిగుతాడా? సిరీస్‌కే దూరమవుతాడా? అనే విషయంలో క్లారిటీ లేదు.


నాకు తెలీదు..

సుందర్ గాయం గురించి కేఎల్ రాహుల్(KL Rahul) మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ‘సుందర్ గాయం తీవ్రత గురించి నాకు తెలియదు. క్రీజులో ఉన్నప్పుడు మాత్రం బంతిని బాగానే కొట్టాడు. అతడు పరిగెత్తలేకపోతున్నాడనే విషయం అప్పుడు నాకు తెలీదు. తొలి ఇన్నింగ్స్‌లో సుందర్ కాస్త ఇబ్బందికి గురయ్యాడని మాత్రం తెలుసు. అతడు బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి చేయాల్సిన పరుగులు పెద్దగా లేవు. బంతికో పరుగు తీస్తే సరిపోతుంది. పెద్దగా రిస్క్‌ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకపోయింది. అతడి మీద ఒత్తిడి కూడా లేదు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. సుందర్ తన పనిని తాను చక్కగా నిర్వర్తించాడు’ అని రాహుల్ వెల్లడించాడు.


అయితే వాషింగ్టన్ సుందర్ గాయంపై బీసీసీఐ(BCCI) అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అలాగే సుందర్ సిరీస్‌కు దూరమయ్యాడా? ఒకవేళ సిరీస్‌లో ఆడలేకపోతే.. వాషీ స్థానంలో ఆడేదెవరు? అనే విషయంలో స్పష్టత లేదు. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులోనూ వాషింగ్టన్ సుందర్ ఉన్న విషయం తెలిసిందే. గాయం తీవ్రతరం కాకుండా.. త్వరలోనే ఫిట్‌గా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆ ఒక్క తప్పిదం మా కొంపముంచింది.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్

ఆ అవార్డులన్నీ మా అమ్మకి పంపిస్తా.. విరాట్ కోహ్లీ ఎమోషనల్

Updated Date - Jan 12 , 2026 | 11:06 AM