Ind Vs NZ: సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:40 PM
స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి పక్కటెముకల్లో గాయం కావడంతో రానున్న రెండు వన్డేలకు అతడు దూరమయ్యాడని పేర్కొంది. అతడి స్థానంలో యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో వాషీ.. వెన్నునొప్పితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఐదు ఓవర్లు వేసిన తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. అయితే ఛేదనలో మాత్రం నొప్పిని భరిస్తూనే క్రీజులోకి వచ్చాడు. వికెట్ల మధ్య పరుగెత్తడానికి కూడా సుందర్ చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాతి మ్యాచులకు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే సందేహాల నడుమ బీసీసీఐ(BCCI) అధికారికంగా స్పందించింది.
‘వాషింగ్టన్ సుందర్(Washington Sundar)కు పక్కటెముకల్లో చీలిక ఏర్పడింది. తదుపరి స్కాన్ల తర్వాత వైద్యుల అభిప్రాయం మేరకు సుందర్ ఆటపై అప్‌డేట్ ఇస్తాం. అయితే ప్రస్తుతానికి మిగిలిన రెండు వన్డేలకు అతను అందుబాటులో ఉండడు’ అని బీసీసీఐ పేర్కొంది.
బదోని అరంగేట్రం..
సుందర్ స్థానంలో సెలక్షన్ కమిటీ ఢిల్లీకి చెందిన యువ ఆటగాడు అయుష్ బదోని(Ayush Badoni )ని ఎంపిక చేసింది. రెండో వన్డే జరిగే రాజ్‌కోట్‌లో అతను జట్టుతో చేరనున్నాడు. ఇది బదోనికి అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి అవకాశం కావడం విశేషం. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రిటైన్ చేసుకోగా, ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. ఎవరీ నందని శర్మ?
టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!