Washington Sundar Injury: సుందర్ అవుట్ జట్టులోకి బదోని
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:11 AM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నుంచి ఇప్పటికే రిషభ్ పంత్ దూరం కాగా తాజాగా మరో భారత క్రికెటర్ అదే బాట పట్టాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో...
వడోదర: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నుంచి ఇప్పటికే రిషభ్ పంత్ దూరం కాగా తాజాగా మరో భారత క్రికెటర్ అదే బాట పట్టాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో మైదానం వీడిన అతను తిరిగి క్రీజులో అడుగుపెట్టలేదు. భారత్ ఛేదనలో ఎనిమిదో నెంబర్ బ్యాటర్‌గా సుందర్ బరిలోకి దిగినా పరుగులు తీసే క్రమంలో నొప్పితో బాధపడ్డాడు. ఈనేపథ్యంలో బీసీసీఐ మెడికల్ సిబ్బంది సూచన మేరకు అతడిని మిగిలిన రెండు వన్డేల నుంచి తప్పించారు. ఇక సుందర్ స్థానంలో అనూహ్యంగా ఆయుష్ బదోనిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. 26 ఏళ్ల బదోని జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో బదోని లఖ్‌నవూ జట్టుకు ఆడుతుండగా, అదే జట్టుకు కోచ్ గంభీర్ గతంలో మెంటార్‌గా వ్యవహరించాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో 96 మ్యాచ్‌లు ఆడిన బదోని సగటు 29.80 మాత్రమే ఉంది. ఇక ఆఫ్ స్పిన్నర్‌గా రాణించేందుకు బదోని నెట్స్‌లో బ్యాటింగ్ చేశాక.. కనీసం 30 బంతుల పాటు బౌలింగ్ చేస్తాడని ఢిల్లీ ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా