Chinese Woman: భారత్‌లో ప్రవేశించేందుకు చైనా మహిళ యత్నం.. అరెస్ట్
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:49 PM
ఇండో-నేపాల్ సరిహద్దుల్లో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఓ మహిళ అరెస్ట్ అయ్యారు. ఆమె వద్ద ఉన్న పత్రాల ఆధారంగా చైనీయురాలిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఓ చైనా మహిళ అరెస్ట్ అయ్యారు(Chinese Woman Arrest). ఆమెను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా ఇండో-నేపాల్ సరిహద్దు(Indo-Nepal border) ప్రాంతంలో సశస్త్ర సీమా బల్(SSB) బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
సదరు మహిళల వద్ద ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆమె పేరు హువాజియా జీ(Huajia Jie) అని, ఆమెను చైనా దేశీయురాలిగా గుర్తించినట్టు నౌతన్వా స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. సరైన వీసా, పాస్‌పోర్టులు లేకుండానే హువాజియా ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించిందనీ(Chinese Woman Tries to Enter India).. అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే.. హువాజియా స్వస్థలం వివరాలు సహా ఆమె భారత పర్యటనకు గల ఉద్దేశమేంటో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు.
ఇవీ చదవండి:
28 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్