ఇన్‌స్టాలో స్మృతి ఫొటోలు తొలగించిన పలాశ్
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:26 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా పలాశ్.. స్మృతికి సంబంధించిన ఫొటోలన్నీ ఇన్‌స్టా నుంచి డిలీట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ 2025 తర్వాత పెళ్లి పీటలెక్కాలనుకున్న స్మృతి.. అనూహ్యంగా అతడితో వివాహాన్ని రద్దు చేసుకుంది. హల్దీ, సంగీత్ వేడుకలు కూడా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు రోజు స్మృతి తండ్రి అనారోగ్యం పాలయ్యారని.. పెళ్లి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రోజులు గడుస్తున్నా వారి వివాహంపై క్లారిటీ రాకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంతలోనే వేరే యువతితో స్మృతి గురించి పలాశ్ చేసిన సంభాషణలు వైరల్ అయ్యాయి. ఈ పరిణామం తర్వాత స్మృతి-పలాశ్‌ల వివాహం రద్దు అయినట్టు ఇరువురు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఆ తర్వాత స్మృతి-పలాశ్ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి సంబంధించిన ఫొటోలన్నీ స్మృతి(Smriti Mandhana) అప్పుడే సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. అయితే తాజాగా పలాశ్ కూడా స్మృతికి సంబంధించిన ఫోటోలన్నీ ఇన్‌స్టా నుంచి డిలీట్ చేశాడు. పెళ్లి రోజు పలాశ్(Palash Muchhal) మరో యువతితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని.. క్రికెటర్లంతా అతడిని చితకబాదారని మంధాన ఫ్రెండ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. అంతే కాక ఓ ప్రాజెక్టు చేద్దామని చెప్పి పలాశ్ రూ.40లక్షలు తీసుకుని ఫోన్ ఎత్తడం మానేశాడని ఆరోపణలు కూడా వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పలాశ్.. స్మృతి ఫొటోలను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆరోపణలపై పలాశ్ స్పందనిదే..
తనపై వచ్చిన ఆరోపణలపై పలాశ్ ముచ్చల్ స్పందించాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. ‘నాపై వస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. కావాలనే లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుంటా’ అని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా కూడా వేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్