Share News

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:04 PM

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌ను ఐసీసీ ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాక్ కూడా వైదొలుగుతుందన్న వార్తలు వచ్చాయి. ఐసీసీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో పీసీబీ వెనక్కి తగ్గి జట్టును ప్రకటించింది.

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
Pakistan

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ(T20 World Cup) కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి తప్పించిన నేపథ్యంలో.. పాక్ కూడా అదే బాటలో నడుస్తుందని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చిన పాక్‌పై ఐసీసీ(ICC) తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో పీసీబీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.


సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పీసీబీ(PCB) జట్టును ప్రకటించింది. బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదీలు తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా.. హారిస్ రౌఫ్‌పై వేటు పడింది.


బంగ్లాను టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పించిన నేపథ్యంలో ఆ దేశానికి బాసటగా పాక్ కూడా టోర్నీ నుంచి వైదొలుగుతుందా అన్న చర్చ మొదలైంది. దీనిపై పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి స్పందించాడు. ‘ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే పీసీబీ నడుచుకుంటుంది. మా ప్రభుత్వం వద్దంటే వాళ్లు ఇంకో జట్టును ఆహ్వానించవచ్చు’ అని నఖ్వి అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్‌ కూడా టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగితే ఆ దేశ క్రికెట్‌పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ మెగా టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది.


పాక్ జట్టు ఇదే..

సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీం అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మిర్జా, నసీం షా, ఫర్హాన్, సయం ఆయుబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

Updated Date - Jan 25 , 2026 | 03:04 PM