సిరీస్ పట్టాలని..
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:33 AM
న్యూజిలాండ్‌తో భారత్ ఐదు టీ20ల సిరీ్‌సలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడో మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఇప్పటికే 2-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న భారత్.. గువాహటిలోనూ తమ ఫామ్‌ను...
మూడో టీ20 నేడు
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
జోష్‌లో టీమిండియా
ఒత్తిడిలో న్యూజిలాండ్
గువాహటి: న్యూజిలాండ్‌తో భారత్ ఐదు టీ20ల సిరీ్‌సలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడో మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఇప్పటికే 2-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న భారత్.. గువాహటిలోనూ తమ ఫామ్‌ను కొనసాగించి సిరీస్ పట్టేయాలనుకుంటోంది.
సంజూ రాణించాలి: రెండో టీ20లో ఇషాన్ కిషన్‌తో పాటు కెప్టెన్ సూర్య అదరగొట్టడంతో జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా మారింది. అయితే ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం సిరీ్‌సలో 16 పరుగులే చేసి విఫలమయ్యాడు. దీంతో అతడి స్థానానికి ఎసరు వచ్చే చాన్సుంది. ఒకవేళ తిలక్ వర్మ కోలుకుని ప్రపంచకప్‌లో ఆడితే సంజూ తన బెర్త్‌ను ఇషాన్‌కు కోల్పోవాల్సి ఉంటుంది. అదే జరిగితే అభిషేక్, ఇషాన్‌ల విధ్వంసకర ఓపెనింగ్‌తో జట్టుకు భారీస్కోర్లు ఖాయమవుతుంటాయి. అందుకే తుది జట్టులో చోటు ఉండాలంటే కివీస్‌తో టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు శాంసన్‌కు ఆఖరి చాన్స్ లాంటివి. బౌలింగ్‌లో స్పిన్నర్ కుల్దీప్, పేసర్ హర్షిత్ మధ్య ఓవర్లను కట్టడి చేస్తున్నారు. అయితే బుమ్రా ఈ మ్యాచ్ ఆడనుండడంతో హర్షిత్ బెంచీకే పరిమితమవొచ్చు. మరోవైపు ఈ టూర్‌లో భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్.. పొట్టి ఫార్మాట్‌లో ఆ జోరు చూపలేకపోతోంది. టీ20 సిరీ్‌సలో నిలవాలంటే ఈ మూడో మ్యాచ్‌లో కివీస్ శక్తిమేరా రాణించాల్సిందే. రెండో టీ20లో ఆరంభం బాగున్నా చివరి వరకు ఆ జోరు కొనసాగించలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్