టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:37 PM
వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ బహిష్కరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ ఆడనుందా? లేదా? అనే సందేహాలకు ఐసీసీ ఎట్టకేలకు తెర దించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ బహిష్కరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రపంచ కప్ చరిత్రలో ఒక జట్టును ఈ విధంగా బయటకు పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బంగ్లాదేశ్‌లో మతపరమైన అల్లర్ల కారణంగా ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ పరిణామంపై బంగ్లా ప్రభుత్వం, బంగ్లా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించాయి. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలంటూ బీసీబీ.. ఐసీసీకి మెయిల్ చేసింది. సమయం తక్కువగా ఉండటంతో వేదికల మార్పు కుదరదని ఐసీసీ స్పష్టం చేసినా.. బీసీబీ మొండి వైఖరి ప్రదర్శిస్తూ వస్తోంది. పలుమార్లు తుది నిర్ణయానికి గడువు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు ఎలాంటి భద్రతాలోపం వాటిల్లదని ఐసీసీ హామీ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఐసీసీ ప్రతినిధులు ఢాకా వెళ్లి బీసీబీతో చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దీంతో బంగ్లాను ఈ మెగా టోర్నీ నుంచి తప్పిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా
నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్