Share News

ఆ సమయంలో ఇషాన్‌పై కోపం వచ్చింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Jan 24 , 2026 | 02:01 PM

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) మెరుపు ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది.అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్‌పై కోపంగా ఉన్నాడట.

ఆ సమయంలో ఇషాన్‌పై కోపం వచ్చింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) మెరుపు ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది. 209 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ బౌండరీలు బాదుతూ జట్టును గాడిలోకి తెచ్చాడు. బంతిని ఎటువైపు సంధించినా.. బౌండరీలు బాదుతుండటంతో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టాయి. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మాత్రం ఇషాన్ కిషన్‌పై కోపంగా ఉన్నాడట.


ఇషాన్ కిషన్(Ishan Kishan) సుడిగాలి ఇన్నింగ్స్ సమయంలో మరో ఎండ్‌లో కెప్టెన్ సూర్య ఉన్నాడు. ఇషాన్ క్రీజులో ఉన్నంత సేపు దాదాపు ప్రతి ఓవర్‌లో మెజారిటీ బంతులు అతనే ఆడాడు. వీరిద్దరి మధ్య 43 బంతుల్లో 122 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు కాగా.. ఇందులో కిషన్ 31 బంతుల్లో 76 పరుగులు బాదేశాడు. సూర్యకు కేవలం 12 బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అందులో సూర్య 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తనకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ఇషాన్ కిషన్ ఎక్కువసేపు క్రీజులో ఉండటంతో సూర్యకు చిరాకు వేసిందట!


‘ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో నాకు అసలు స్ట్రైక్ ఇవ్వలేదు. నాకు అప్పుడు బాగా కోపం వచ్చింది. ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో తెలియదు. కానీ అతడు బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ నేనేప్పుడూ చూడలేదు. అయితే కిషన్ దూకుడుగా ఆడటంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు సమయం దొరికింది. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను. వాటి ఫలితం ఈ మ్యాచులో స్పష్టంగా కనిపించింది’ అని సూర్య వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌తో రెండో టీ20.. పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా

నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్

Updated Date - Jan 24 , 2026 | 06:03 PM