పౌలినికి షాక్...
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:42 PM
సాఫీగా సాగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఏడో సీడ్ జాస్మిన్ పౌలినికి మూడో రౌండ్‌లో చుక్కెదురైంది.
- ప్రీక్వార్టర్స్‌లో అల్కారజ్, జ్వెరెవ్, సబలెంక, గాఫ్
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: సాఫీగా సాగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఏడో సీడ్ జాస్మిన్ పౌలినికి మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. ఇక టాప్ సీడ్ అల్కారజ్, మూడో సీడ్ జ్వెరెవ్, ఆరో సీడ్ డిమినార్, 11వ సీడ్ మెద్వెదెవ్, వరల్డ్ నెం.1 సబలెంక, మూడో సీడ్ కొకొ గాఫ్, ఎనిమిదో సీడ్ ఆండ్రీవా ప్రీక్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో అమెరికన్ టీనేజర్ ఇవా జొవిక్ 6-2, 7-6 (3)తో ఇటలీకి చెందిన పౌలినికి షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో సబలెంక 7-6 (4), 7-6 (9) అనస్టాసియా పొటపోవాపై,

కొకొ గాఫ్ 3-6, 6-0, 6-3తో బాప్టిస్ట్‌పై, ఆండ్రీవా 6-3, 6-4తో రుసెనిపై, 12వ సీడ్ స్విటోలినా 7-6 (4), 6-3తో ష్నేడిర్‌పై, ముచోవా 6-1, 6-1తో లినెట్టిపై నెగ్గారు. పురుషుల నెం.1 అల్కారజ్ 6-2, 6-4, 6-1తో మౌటెట్‌పై అలవోకగా గెలిచి ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. జ్వెరెవ్ 7-5, 4-6, 6-3, 6-1తో కామెరూన్ నోరీపై నెగ్గేందుకు శ్రమించాడు. ఆరో సీడ్ డిమినార్ 6-3, 6-4, 7-5తో 29వ సీడ్ టియఫోపై గెలుపొందగా, మెద్వెదెవ్ 6-5 (7), 4-6, 7-5 6-0, 6-3తో మరోజన్‌పై ఐదు సెట్లు పోరాడి రౌండ్-16కి ముందంజ వేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News