ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:49 PM
రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. 1.1 ఓవర్లకు టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 6 పరుగుల వద్ద పీకల్లోతు కష్టాల్లో పడ్డ సమయంలో సూర్య బ్యాటింగ్‌కు దిగాడు. ఇషాన్ కిషన్(76)తో కలిసి మూడో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి 11 బంతులు నెమ్మదిగా ఆడిన సూర్య.. తర్వాత పుంజుకుని కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) కొనియాడాడు.
‘సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తొలి 11 బంతులు చాలా నెమ్మదిగా ఆడాడు. సూర్య, ఇషాన్ కిషన్ మూడో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో కిషన్ 76 పరుగులు కొడితే.. సూర్య 39 పరుగులు సాధించాడు. ఈ సమయంలో సూర్య తన పరిణతి ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్ అద్భుతంగా పరుగులు రాబడుతున్నప్పుడు సూర్య అతడికే ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చేలా చూశాడు. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ పెవిలియన్‌కు చేరాడో.. అప్పుడు సూర్య తన గేరు మార్చాడు. అతడు మొదట సాధ్యమైనంత స్ట్రైట్‌గా ఆడేందుకు ప్రయత్నించాడు. తర్వాత తన ఫేవరెట్ షాట్లతో చెలరేగిపోయాడు. వరల్డ్ కప్‌నకు ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవడం టీమిండియాకు శుభపరిణామం’ అని గావస్కర్ అన్నాడు.
కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్.. నాగ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో రిథమ్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో అతడు నాలుగు ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 22 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. రెండో టీ20లో అతడు 9 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 37 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో టీ20లోనూ సూర్యకుమార్ బ్యాట్ నుంచి మెరుపులు చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా
నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్