Share News

Bangladesh Cricket Board: తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’.. బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jan 10 , 2026 | 06:43 AM

బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌పై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ సంచలన ఆరోపణలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ‘ఇండియన్ ఏజెంట్’ అని నిందించాడు. ఐసీసీ నుంచే 95 శాతం వరకు బంగ్లా క్రికెట్‌కు నిధులు వస్తాయని.. బీసీబీ జాగ్రత్తగా వ్యవహరించాలని తమీమ్ సూచించిన విషయం తెలిసిందే.

Bangladesh Cricket Board: తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’..  బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు
Tamim Iqbal

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లా-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ సంచలన ఆరోపణలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ‘ఇండియన్ ఏజెంట్’ అని నిందించాడు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టు భారత్‌కు రాలేదని, మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలంటూ బీసీబీ(Bangladesh Cricket Board).. ఐసీసీకి లేఖ రాసింది. దీసిసి ఐసీసీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.


అయితే ఈ అంశంపై బంగ్లా మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) మాట్లాడాడు. ‘బంగ్లా క్రికెట్‌కు 90 నుంచి 95 శాతం వరకు నిధులు ఐసీసీ(ICC) నుంచే వస్తున్నాయి. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు వందసార్లు ఆలోచించుకోవాలి’ అని బీసీబీకి సూచించాడు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ ఘాటుగా స్పందించాడు. ‘తమీమ్ ఇక్బాల్ ఇండియన్ ఏజెంట్ అని ఈ సారి బంగ్లాదేశ్ మొత్తానికి నిరూపితమైంది’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్

Bangladesh Cricket: బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. ఆర్థికంగా కుదేలు కానున్నారా..?

Updated Date - Jan 10 , 2026 | 06:48 AM