MI VS RCB : ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:06 PM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 154 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు తెరలేచింది. ఇవాళ(శుక్రవారం) తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు ముందు 155 పరుగుల టార్గెట్ ఉంది.
ఇక ముంబై బ్యాటర్లలో సజీవన్ సజన (45 పరుగులు;25 బంతులు), నికోలా కారీ(40 పరుగులు;29బంతులు), జి. కమలిని (32 పరుగులు;28 బంతులు) రాణించారు. చివర్లో సంజన, కారీ బెంగళూరు బౌలర్లపై విరుచకపడ్డారు. సజన తృటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకుంది. ఇక ఆర్సీబీ బౌలర్లో డి క్లర్క్ 4, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్ చెరో వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
Bangladesh Cricket: బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. ఆర్థికంగా కుదేలు కానున్నారా..?