Team India: తిలక్ వర్మ స్థానంలో అతడే సరైన ఎంపిక: ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:59 AM
స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అనూహ్యంగా గాయం బారిన పడి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. మరి తిలక్ వర్మ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న వేళ టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అనూహ్యంగా గాయం బారిన పడి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలి మూడు టీ20లకు తిలక్ అందుబాటులో ఉండడని బీసీసీఐ(BCCI) ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధిస్తేనే మిగతా మ్యాచుల్లో బరిలోకి(Tilak Varma) దిగుతాడని కూడా స్పష్టం చేసింది. మరి తిలక్ వర్మ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
‘ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు ఓ కొత్త ఆటగాడు కావాలి. అది శుభ్‌మన్ గిల్? అంటే కాదు. అతడి అవసరం జట్టుకు లేదు. యశస్వి జైస్వాల్ కూడా వద్దు. టీమిండియాకు మరో ఓపెనర్ అవసరం లేదు. తిలక్ వర్మ మిడిలార్డర్‌లో ఆడతాడు. కాబట్టి నెంబర్ 3, 4 స్థానాల్లో ఆడగలిగే బ్యాటర్‌ను ఎంపిక చేయాలి. అతడు ఆల్‌రౌండర్ అయితే ఇంకా మంచిది. అయితే ప్రస్తుతం అలాంటి ఆటగాడు ఎవరూ లేకపోతే.. ఏకైక ఆప్షన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). అతడినే నేరుగా ఎంపిక చేయొచ్చు. ఇప్పటికే అతను అద్భుతంగా ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణించాడు. ఆసియా కప్‌లో అవకాశం దక్కనప్పుడే ఘోర తప్పిదం జరిగిందనే అభిప్రాయం నాకు కలిగింది. కానీ ఇప్పుడు మిడిలార్డర్ బ్యాటర్‌గా ఆడించే అవకాశం ఉంది. ఓ సీనియర్ బ్యాటర్‌గా, ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాడిగా అయ్యర్‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. నా ఓటు అయితే శ్రేయస్ అయ్యర్‌కే’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.
అతడు కాకపోతే..
‘శ్రేయస్ అయ్యర్‌ను వద్దనుకుంటే మాత్రం రియాన్ పరాగ్(Ryan Parag)ను తీసుకోవాలి. ఎందుకంటే అతడు టీమిండియా టీ20 ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అతడు కొన్ని ఓవర్లు బౌలింగ్ కూడా వేయగలడు. ఆల్‌రౌండర్ కావాలనుకుంటే మాత్రం రియాన్ పరాగ్ మంచి ఆప్షన్ అవుతాడు. కానీ నా ఫస్ట్ ఛాయిస్ మాత్రం శ్రేయస్ అయ్యర్. జితేశ్ శర్మ పేరు కూడా వినిపిస్తుంది. కానీ అతడిని అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాకు కావాల్సింది మిడిలార్డర్ బ్యాటర్. కానీ జితేశ్ వికెట్ కీపర్. జట్టులో ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. కాబట్టి అతడిని తీసుకునే అవకాశం లేదు’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం.. హర్మన్‌ప్రీత్ కౌర్
తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’.. బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు