అతడు సక్సెస్ అవ్వలేడు.. అభిషేక్ శర్మను ఎగతాళి చేసిన పాక్ మాజీ ప్లేయర్
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:50 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాక్ తలపడనున్నాయి. దీనికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మపై పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. అతడు ఓ స్లాగర్(బంతిని బలంగా బాదడం) అంటూ ఎగతాళి చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీశాయి.
‘అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అతడు ఓ స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. ప్రతి బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి ఆటతీరు ప్రదర్శిస్తే.. ఎప్పుడో ఒకసారి మాత్రమే సక్సెస్ అవ్వగలరు. అభిషేక్ శర్మ సక్సెస్ అయ్యేదాని కంటే విఫలమయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభిషేక్ శర్మ దగ్గర సరైన బ్యాటింగ్ కూడా టెక్నిక్ లేదు.
ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఒకే చోట నిలబడి అన్ని బంతులను ఒకే ఏరియాలోకి వేయాలని కోరుకుంటాడు. బంతిని బాడీ లైన్ వేసినా.. కొంచెం స్వింగ్ అయినా కూడా అభిషేక్ ఆడలేడు’ అంటూ ఆమీర్.. అభిషేక్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడి.. నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. పాక్‌తో మ్యాచ్ వరకు ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్