Home » Rajastan Royals
ఐపీఎల్‌లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 ఫైనల్ వేళ ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఈ సీజన్లో తన అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన వైభవ్ .. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. కేవలం రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగిన ఈ యువ ఆటగాడు.. తన బ్యాటింగ్‌తో జట్టుకు అపారమైన విలువను అందించినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ కీలక పోరు జరుగుతోంది. క్వాలిఫయర్- 2లో భాగంగా చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. మరి ఇరుజట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. అయితే జట్టు ప్రదర్శనపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సిందంటూ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు.
ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 97 పరగులు చేసి ఔటయ్యాడు. దీంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎస్ఆర్‌హెచ్‌పై భీకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. క్రిస్ గేల్ ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(97*) చెలరేగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.