Share News

ఐపీఎల్‌లో ట్రేడ్ డీల్: రాజస్థాన్ రాయల్స్‌కు హార్దిక్ పాండ్య!

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:50 PM

ఐపీఎల్‌లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ట్రేడ్ డీల్: రాజస్థాన్ రాయల్స్‌కు హార్దిక్ పాండ్య!
IPL Trade

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జట్టును వీడే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు హార్దిక్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతిగా ఆర్ఆర్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ ముంబైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులో భారీగా మార్పులు చేయడానికి ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు సమాచారం. అందులోనూ హార్దిక్ పాండ్య ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో అసంతృప్తి, అంతర్గత విభేదాల కారణంగా హార్దిక్ ఒత్తిడి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా అతడే జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు సీనియర్ ప్లేయర్ల విషయంలోనూ ట్రేడ్ చర్చలు జరుగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.


ముంబైకి యశస్వి..?

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భవిష్యత్తుపై కూడా కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా యశస్విపై ఒత్తిడి పెరిగిపోతుందని మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానించారు. ఒత్తిడి కారణంగా పరుగులు చేయలేకపోతున్నాడంటూ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆర్ఆర్ అతడిని ప్రధాన ప్లేయర్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ.. అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు రియాన్ పరాగ్‌కు అప్పగించారు. దీంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ కూడా ఫ్రాంచైజీ మారడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్-యశస్వి ట్రైడ్ నిజంగా జరిగితే.. అది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలన నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫ్రాంచైజీ తదుపరి నిర్ణయాలపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంగా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

టెస్టు క్రికెట్‌ రీఎంట్రీపై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!

Updated Date - Jun 22 , 2026 | 01:50 PM