ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్: ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాక్
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:03 PM
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపిన్‌షిప్ పట్టికలో 12 పాయింట్ల కోత విధించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఏకంగా 12 ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలడంతో ఐసీసీ ఈ శిక్షణను అమలు చేసింది. అదనంగా ఇంగ్లండ్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించింది.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ శిక్షను అమలు చేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఓవర్ ఆలస్యానికి ఒక పాయింట్ కోత విధిస్తారు. దీంతో మొత్తం 12 ఓవర్లకు గానూ 12 పాయింట్లు ఇంగ్లండ్ ఖాతా నుంచి తగ్గించారు. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ జో రూట్ ఈ తప్పును అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండా ఈ వ్యవహారం ముగిసింది. కాగా ఈ కోత కారణంగా డబ్ల్యూటీసీ పట్టికలో 38 పాయింట్లతో ఇంగ్లండ్ ఏడో స్థానానికి పడిపోయింది. 34.72 పర్సెంటేజ్ నుంచి 26.39 పర్సెంటేజ్‌కు పడిపోవడంతో.. ఫైనల్ రేసులో ఇంగ్లండ్ పరిస్థితి మరింత కఠినంగా మారింది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 253 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందడంతో.. ఈ సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మరోవైపు పలు వివాదాల కారణంగా జట్టుకు దూరమైన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులో చేరనున్నాడు. స్టార్ పేసర్ అట్కిన్సన్ కూడా మూడో టెస్టుకు అందుబాటులోకి రానుండటంతో ఇంగ్లండ్‌కు కొంత ఊరట లభించినట్లు అయింది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!
టెస్టు క్రికెట్ రీఎంట్రీపై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!