యూనివర్సల్ బేబీ బాస్ తాండవం.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ABN , Publish Date - May 28 , 2026 | 07:13 AM
ఎస్ఆర్‌హెచ్‌పై భీకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. క్రిస్ గేల్ ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో ఇతడి పేరే మార్మోగిపోతోంది. ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 29 బంతుల్లో 97 పరుగులు.. తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మిస్ అయింది. అయితేనేమీ జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. అతడి ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అయితే ఎస్ఆర్‌హెచ్‌పై భీకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. క్రిస్ గేల్ ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.
వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు. ఇందులో 12 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లో 680 పరగులు చేసిన అతడు.. ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 65 సిక్సర్లు, 55 ఫోర్లు బాదాడు.
రికార్డులే రికార్డులు!
ఎస్ఆర్‌హెచ్‌పై వైభవ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన బ్యాటర్ల జాబితాలో అతడు సురేశ్ రైనాతో సమంగా నిలిచాడు.
ప్లే ఆఫ్స్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు:
సురేశ్ రైనా(16 బంతుల్లో)- పంజాబ్ కింగ్స్‌పై
వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో)- ఎస్ఆర్‌హెచ్‌పై
గిల్‌క్రిస్ట్(17 బంతుల్లో)- ఢిల్లీ క్యాపిటల్స్‌పై
ఎంఎస్ ధోని(20 బంతుల్లో)- ముంబైపై
20 బంతుల్లోపు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. నికోలస్ పూరన్‌తో సమంగా నిలిచాడు. 20 బంతుల్లోపు అభిషేక్ శర్మ 6 సార్లు హాఫ్ సెంచరీలు చేయగా, నికోలస్ పూరన్, వైభవ్ ఐదు సార్లు చేశారు.
పవర్ ప్లేలో అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్ చేసిన ప్లేయర్ల జాబితాలో వైభవ్ రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ వార్నర్(6 సార్లు) అగ్రస్థానంలో ఉండగా, వైభవ్ సూర్యవంశీ(5 సార్లు), ట్రావిస్ హెడ్(4 సార్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఎస్ఆర్‌హెచ్‌పై పవర్ ప్లేలోనే వైభవ్ 8 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి స్థానాల్లో సనత్ జయసూర్య, బట్లర్, బెయిర్‌స్టో, అభిషేక్ శర్మ ఉన్నారు. వీరంతా పవర్ ప్లేలో 7 సిక్సర్లు బాదారు. తాజాగా వైభవ్ ఈ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!
సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!