Share News

తన ప్రపంచ రికార్డును తానే..

ABN , Publish Date - May 28 , 2026 | 02:15 AM

భారత పారా అథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌ ఇండియన్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ పారా అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు...

తన ప్రపంచ రికార్డును తానే..

పారా అథ్లెట్‌ సుమిత్‌ సంచలనం

బెంగళూరు: భారత పారా అథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌ ఇండియన్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ పారా అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బుధవారం జరిగిన జావెలిన్‌ త్రో ఎఫ్‌64 ఈవెంట్‌లో 27 ఏళ్ల సుమిత్‌ ఈటెను 74.82 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో 2022 ఆసియా పారా గేమ్స్‌లో తానే నెలకొల్పిన 73.29 మీటర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. హరియాణాలోని సోనెపట్‌కు చెందిన సుమిత్‌.. 2020, 2024 పారాలింపిక్స్‌లో, 2023, 2024, 2025 ప్రపంచ పారా చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణాలు గెలిచాడు.

ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 28 , 2026 | 02:15 AM