Share News

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

ABN , Publish Date - May 27 , 2026 | 03:46 PM

ఇటీవలే ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ను, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో..

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!
Travis Head wife Jessica Davies

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవలే ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్‌ను, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపుల గురించి జెస్సికా సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఈ వివాదంతో ట్రావిస్, జెస్సికాల ప్రేమాయణం బయటకు వచ్చింది. వీరి లవ్ స్టోరీ చాలా ట్విస్టులతో సాగింది. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం...


ట్రావిస్ హెడ్, జెస్సికా ప్రేమ కథ పక్కా సినిమా స్టోరీలానే ఉంటుంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో జన్మించిన జెస్సికా.. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. స్కూల్ రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దాదాపు 15 ఏళ్ల పాటు ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉన్న ఈ జంట.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా కాలం ఈ జంట డేటింగ్ చేసింది. చివరకు 2021 మార్చిలో అధికారికంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.Travis-Head-Jessica.jpg


ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. వీరు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టక ముందే తల్లిదండ్రులు అయ్యారు. 2022 సెప్టెంబర్‌లో జెస్సికా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు 'మిలా పేజ్ హెడ్' అని పేరు పెట్టారు. ఏడాది తర్వాత 2023 ఏప్రిల్ 15న అడిలైడ్‌లోని చారిత్రాత్మక పబ్లిక్ మ్యూజియం 'క్యారిక్ హిల్' లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు.


పెళ్లికి ముందు జెస్సికా మోడలింగ్ రంగంలో రాణించారు. ఆస్ట్రేలియాలోని పలు టాప్ మోడలింగ్ ఏజెన్సీలతో కలిసి పనిచేసిన ఆమె, తన అద్భుతమైన పర్సనాలిటీతో మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆమె పాత ఫొటోషూట్లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం జెస్సీకా బిజినెస్‌వుమన్‌గా రాణిస్తున్నారు. సిడ్నీ, కాన్‌బెర్రా వంటి పెద్ద నగరాల్లో జెస్సికాకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఫుడ్ బిజినెస్‌లో బిజీగా ఉంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ!

ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయ రహస్యాన్ని చెప్పేసిన భువీ!

Updated Date - May 27 , 2026 | 04:39 PM