Share News

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

ABN , Publish Date - May 27 , 2026 | 02:59 PM

దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే వచ్చాయని విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం. భరత్ వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ నినాదంతో సక్సెస్ అయ్యామన్నారు.

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
TDP MP Sri Bharat

విశాఖపట్నం, మే27: దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే వచ్చాయని విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం. భరత్ వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ నినాదంతో సక్సెస్ అయ్యామన్నారు. బుధవారం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలోని 42, 43వ వార్డుల క్లస్టర్‌లో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. 20, 25 ఏళ్ల లోపు యువతకు పబ్లిక్ పాలసీ, రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మహిళా బిల్లు చట్టం అమలులోకి రావడం ఖాయమన్నారు. పార్టీలోకి పెద్ద ఎత్తున మహిళా శ్రేణులను తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తోందని తెలిపారు.


టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించటం శుభసూచకమని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకు వెళ్లనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 82 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌లో మహానాడు ప్రత్యక్ష ప్రసారం వీక్షించేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా1,850 క్లస్టర్లలో మహానాడు సమావేశాల నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని 81 క్లస్టర్లలో వర్చువల్‌గా నిర్వహించిన మహానాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్

For More AP News And Telugu News

Updated Date - May 27 , 2026 | 04:11 PM