తెలంగాణలో భారీగా ఎమ్మార్వోల బదిలీ
ABN , Publish Date - May 27 , 2026 | 04:00 PM
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు.12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, మే 27: రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు జరిగాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.
నిర్మల్‌కి చెందిన ఏ. మోతీరాంను మంచిర్యాల డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.
కరీంనగర్‌కి చెందిన బి. రాజేశ్వరికి పెద్దపల్లి డీఆర్వో బాధ్యతలు అప్పగించారు.
పెద్దపల్లికి చెందిన కె.వై.ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్వోగా నియమించారు.
వనపర్తికి చెందిన ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్వోగా బదిలీ చేశారు.
ఖమ్మంకి చెందిన వి. రవి కుమార్‌ను ములుగు డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.
మేడ్చల్-మల్కాజిగిరి జె.స్వామికి కరీంనగర్ డీఆర్వోగా బాధ్యతలు అప్పగించారు.
నాగర్‌కర్నూల్‌కి చెందిన ఎ. పాండుకు కామారెడ్డి డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.
జనగాంకి చెందిన సీహెచ్ శ్రీకాంత్‌కు మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియామించారు.
సూర్యాపేటకి చెందిన ఎం. సుదర్శన్ రెడ్డికి సిద్ధిపేట ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా బాధ్యతలు అప్పగించారు.
ఖమ్మం ఎం. రామదేవికి నల్గొండ ఎస్‌డీసీ(ఎల్‌ఏ) పోస్టింగ్
పెద్దపల్లి జి. కుమారస్వామికి సిరిసిల్ల ఎస్‌డీసీ(ఎల్‌ఏ) బాధ్యతలు
కరీంనగర్ ఎన్. వెంకట్ రెడ్డికి కరీంనగర్ ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా నియామకం
ఈ వార్తలు కూడా చదవండి..
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More TG News And Telugu News