Home » Australia Cricketers
ఆస్ట్రేలియా క్రికెటర్లు అస్టన్ అగర్, అరోన్ హర్డీ ప్రయాణిస్తున్న ఉబర్ కారు రోడ్డుపై ఆగిపోయింది. దీంతో వారు ఆ కారును తోసుకుంటూ స్టేడియానికి చేరుకున్నారు. బిగ్‌బాష్‌లీగ్‌లో (Big Bash League) భాగంగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు వారు మైదానానికి చేరుకునే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్ వచ్చే ఏడాది జనవరి 26 వరకు వేలంలో ఉండనుంది.
యాషెస్ సిరీస్2025లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్.. 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.
మెల్‌బోర్న్‌కు చెందిన బెన్ అస్టిన్ టీ20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ట్రైనింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో అతడు కుప్పకూలిపోయాడు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ మృతి చెందాడు.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా..కొందరి బుద్ధి మారడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ఆడవాళ్ళు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. ఈ సారి ఏకంగా మహిళా క్రికెటర్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆ జట్టు క్రికెటర్లు భారత్, పాక్ కరచాలన వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. భారత్ ప్లేయర్లను ఎక్కిరించినట్లుగా ఓ వీడియోను చేశారు.
ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్, జాతీయ జట్టు మొదటి పూర్తి సమయం కోచ్ అయిన బాబ్ సింప్సన్, 89 ఏళ్ల వయస్సులో సిడ్నీలో మరణించారు. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఈ విషాదకర వార్తను ధృవీకరించింది.
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 133 పరుగులతో గెలిచింది...
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
IPL Franchises: ఐపీఎల్-2025 త్వరలో మళ్లీ ప్రారంభం కానుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. అయితే ఫ్రాంచైజీల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పలువురు కీలక ఆటగాళ్లు మిస్ అవుతుండటంతో జట్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.