Share News

Australian Cricketers: పాక్‌తో షేక్ హ్యాండ్ వివాదం..భారత్‌ను ఎక్కిరించిన ఆసీస్ ప్లేయర్లు

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:49 PM

ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆ జట్టు క్రికెటర్లు భారత్, పాక్ కరచాలన వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. భారత్ ప్లేయర్లను ఎక్కిరించినట్లుగా ఓ వీడియోను చేశారు.

Australian Cricketers: పాక్‌తో షేక్ హ్యాండ్ వివాదం..భారత్‌ను ఎక్కిరించిన ఆసీస్ ప్లేయర్లు
Australia Players

ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం నెలకున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్..ఏసీసీ చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అలానే భారత మహిళా క్రికెట్ జట్టు కూడా పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలన అది క్రికెట్ ప్రపంచంలో ఫుల్ వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే.. తనకు సంబంధం లేని ఇలాంటి వివాదంపై ఆస్ట్రేలియా పరోక్షంగా రియాక్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే.. భారత్ ప్లేయర్లను ఎక్కిరించినట్లుగా ఓ వీడియోను చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


త్వరలో ఆస్ట్రేలియాలో(Australia Tour) జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆ జట్టు క్రికెటర్లు భారత్(India), పాక్ కరచాలన వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఆసీస్ ప్లేయర్ మాట్లాడుతూ.. "మనందరికీ తెలుసు, భారత జట్టు మా దేశానికి వస్తోంది. అయితే మేము వారిలో ఒక కీలకమైన బలహీనతను గుర్తించాం" అని అన్నాడు. "హ్యాండ్‌షేక్(Shake Hand) అంటే వారికి అంతగా ఇష్టం లేదని మాకు తెలుసు. కాబట్టి మేము ఒక బంతి వేయకముందే వారిని మానసికంగా ఆందోళనకు గురి చేయగలం" అని మరో క్రికెటర్ వ్యాఖ్యానించారు.


ఇలా హ్యాండ్‌షేక్‌ను ఒక 'బలహీనత'గా క్రియేట్ చేసి.. భారత ప్లేయర్లతో(Indian Players) కరచాలనకు తాము ఎలాంటి కొత్త తరహా 'గ్రీటింగ్స్' ప్రయత్నించవచ్చో సూచిస్తూ ఆసీస్ ప్లేయర్లు సరదాగా స్పందించారు. ఈ వీడియో భారత్ అభిమానులకు కోపం తెప్పించింది. మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఏకాగ్రతను భంగం చేయడానికి ఆస్ట్రేలియా ఇలాంటి చౌకబారు వీడియోలు మొదలుపెట్టిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు చరిత్రలో స్లెడ్జింగ్‌(sledging) ఓ అంతర్భాగమనే విషయం అందరికి తెలిసిందే. ఇది వారి ఆటలో ఒక వ్యూహాత్మక ఆయుధంగా పనిచేస్తుంది. ఆస్ట్రేలియా జట్టు ఆ స్లెడ్జింగ్(sledging) సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాజాగా టీమిండియా ఆటగాళ్లను ఎక్కిరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Kareena Kapoor comments: మా వాడికి ఆ క్రికెటర్ అంటే పిచ్చి: కరీనా కపూర్

Shivam Dube Injured: ఆసీస్ టూర్ వేళ టీమిండియాకు బిగ్ షాక్!

Updated Date - Oct 15 , 2025 | 05:50 PM