Share News

Shivam Dube Injured: ఆసీస్ టూర్ వేళ టీమిండియాకు బిగ్ షాక్!

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:35 PM

ఆస్ట్రేలియాలో జరిగే వన్డే, టీ20 సిరీస్ లను గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. కీలకమైన ఈ టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.

Shivam Dube Injured: ఆసీస్ టూర్ వేళ టీమిండియాకు బిగ్ షాక్!
India cricket news

ఆసియా కప్ 2025 ట్రోఫీ గెలుపు, వెస్టిండీస్ పై టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ తో భారత్ మంచి జోష్ లో ఉంది. ఇక ఆస్ర్టేలియాలో జరిగే వన్డే, టీ20 సిరీస్ లను భారత్ గెలవాలని పట్టుదలతో ఉంది. అది అంత ఈజీ కాకపోయినా ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ చూస్తే..సాధ్యం కావచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా ఆసీస్‌తో జరగబోయే కీలకమైన టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.


టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కావడంతో క్రికెట్ ఫ్యాన్స్‌తో ఆందోళన వ్యక్తమవుతుంది. అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు కొన్ని రోజుల ముందు ఈ స్టార్ ఆటగాడు గాయంతో ఇబ్బంది పడటం.. జట్టు వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. శివమ్ దూబే వెన్ను నొప్పి సమస్యతో(Shivam Dube Injured) బాధపడుతున్నాడని సమాచారం. రంజీ ట్రోఫీ 2025లో భాగంగా ముంబై జట్టు(Mumbai cricket update) జమ్మూ కాశ్మీర్‌తో శ్రీనగర్‌లో ఆడే తొలి మ్యాచ్‌కు కూడా శివమ్ దూబే అందుబాటు ఉండటం లేదు.

వాస్తవానికి రంజీ మ్యాచ్ కోసం ముంబై జట్టుతో కలిసి దూబే(Shivam Dube) శ్రీనగర్‌కు వెళ్లాడు. అయితే అక్కడి తీవ్రమైన చల్లని వాతావరణం దూబే వెన్నునొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైద్య బృందం వెంటనే విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇవ్వడంతో దూబే మంగళవారం (అక్టోబర్ 14) ముంబైకి తిరిగి వచ్చినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ధ్రువీకరించాయి.


ఆస్ట్రేలియాలో(Australia) జరిగే పూర్తి స్థాయి వైట్-బాల్ పర్యటన కోసం టీమిండియా సిద్ధమవుతోంది. టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో శివమ్ దూబే ఓ కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్ జరగనుంది. 2026 టీ20 ప్రపంచ కప్(World cup) సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ అత్యంత కీలకం ఉంది. ఇలాంటి సమయంలోనే శివమ్ దూబే(Shivam Dube) గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే టీ 20 సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.



ఈ వార్తలు కూడా చదవండి..

Kareena Kapoor comments: మా వాడికి ఆ క్రికెటర్ అంటే పిచ్చి: కరీనా కపూర్

షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

Updated Date - Oct 15 , 2025 | 04:10 PM