Share News

Kareena Kapoor comments: మా వాడికి ఆ క్రికెటర్ అంటే పిచ్చి: కరీనా కపూర్

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:00 PM

సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో కరీనా కపూర్ పాల్గొంది. ఈ క్రమంలో తన కుమారుడు తైమూర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తైమూర్‌కు నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసింది.

Kareena Kapoor comments: మా వాడికి ఆ క్రికెటర్ అంటే పిచ్చి: కరీనా కపూర్
Kareena Kapoor

బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. విభిన్న క్యారెక్టర్లు చేయడంలో కరీనా కపూర్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇక సైఫ్ అలీఖాన్ తో వివాహం అనంతరం సినిమాలకు విరామం ఇచ్చింది. వారిద్దరికి ఓ కొడుకు జన్మించాడు. ఇది ఇలా ఉంటే..కరీనా కపూర్..టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


తాజాగా తన ఆడపడుచు, భర్త సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో(Bollywood viral news) కరీనా కపూర్ పాల్గొంది. ఈ క్రమంలో తన కుమారుడు తైమూర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తైమూర్‌కు నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ( Virat Kohli) అంటే తన కొడుకు తైమూర్‌కు పిచ్చి అని ఈ బాలీవుడ్ బ్యూటీ తెలిపింది. ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడని, అతని ఫోన్ నంబర్ ఉందా? అని ప్రశ్నిస్తుంటాడని ఆమె(Kareena Kapoor) చెప్పుకొచ్చింది.


సినిమా స్టార్లు, నటనపై తైమూర్‌ ఏ మాత్రం ఆసక్తి చూపడని, కానీ కోహ్లీ(Virat Kohli), రోహిత్, లియోనల్ మెస్సీల గురించి మాత్రం తరచూ అడుగుతుంటాడని కరీనా కపూర్ వెల్లడించింది. ఇక కరీనా కపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌ కాగా నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేశారు. జీన్స్ ఎక్కడి పోతాయని, తాతా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ వారసత్వాన్ని తైమూర్ కొనసాగిస్తాడేమోనని వారి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) తండ్రి మన్సూర్ అలీ ఖాన్ టీమిండియా మాజీ కెప్టెన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మూడు దగ్గు మందులు ప్రమాదకరం

షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

Updated Date - Oct 15 , 2025 | 03:47 PM