Yarlagadda Venkatarao: వైసీపీ కోడిగుడ్డు తెస్తే.. టీడీపీ గూగుల్ తెచ్చింది: యార్లగడ్డ వెంకట్రావు
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:32 PM
గత ప్రభుత్వ హయాంలో కాల్ సెంటర్లు కూడా తీసుకురాలేని మాజీ మంత్రి డేటా సెంటర్ గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందంటూ వైసీపీ నేతలను టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎద్దేవా చేశారు.
గన్నవరం, అక్టోబర్ 15: గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు రావడం గర్వ కారణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బుధవారం నాడు గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైసీపీ కోడిగుడ్డు తెస్తే.. టీడీపీ గూగుల్‌ను తెచ్చిందన్నారు. యంగెస్ట్ స్టేట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు గూగుల్ రాకతో హైఎస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్టేట్‌గా మారిందన్నారు. గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్లు కంపెనీలను తీసుకొచ్చిన వారికి ఐటి కంపెనీ విలువ ఏం తెలుసంటూ వైసీపీ నేతలకు ఆయన చురకలంటించారు.
కాల్ సెంటర్లు కూడా తీసుకురాలేని మాజీ మంత్రి డేటా సెంటర్ గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని వైసీపీ నేతను ఎద్దేవా చేశారు. అమెరికాలోని లౌడన్ కౌంటీ లాగా ఏపీకి గూగుల్ రాకతో టెక్ – ఎకానమిక్ పవర్ హౌస్‌గా విశాఖపట్నం మారబోతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలను మంత్రి లోకేష్ ఇస్తున్నారని.. వాటిని అడ్డుకోవడమే పనిగా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
గూగుల్ రాకను వ్యతిరేకిస్తున్నారో, స్వాగతిస్తున్నారో స్పష్టంగా చెప్పాలంటూ వైసీపీ నేతలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. రూ.5వేల కోట్లు టర్నోవర్ ఉండే కేడీసీసీ బ్యాంక్‌కు తాను చైర్మన్ అయిన తర్వాత.. రూ.9వేల కోట్లకు పెంచి దేశంలోనే నెం.1 స్థానంలో నిలిపానని ఆయన వివరించారు.
కానీ, 12మంది డీసీసీబీ చైర్మన్ల పదవీ కాలాన్ని జగన్ రెడ్డి పొడిగించి తన పదవిని మాత్రం రెన్యూవల్ చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి అది అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అందుకే గూగుల్ రాకపై ఆయన నోరు మెదపడం లేదన్నారు. గూగుల్ రావడం వల్ల ప్రయోజనాలపై వైసీపీలోని ఏ మేధావితోనైనా తాను చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఎఫెక్ట్.. స్పందించిన ప్రభుత్వం.. తీరనున్న ఉల్లి రైతు కష్టాలు..
చెవిరెడ్డి బెయిల్‌పై విచారణ.. సుప్రీం కీలక నిర్ణయం
For More AP News And Telugu News