Australian Cricketers: రోడ్డుపై కారును నెట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:17 PM
ఆస్ట్రేలియా క్రికెటర్లు అస్టన్ అగర్, అరోన్ హర్డీ ప్రయాణిస్తున్న ఉబర్ కారు రోడ్డుపై ఆగిపోయింది. దీంతో వారు ఆ కారును తోసుకుంటూ స్టేడియానికి చేరుకున్నారు. బిగ్‌బాష్‌లీగ్‌లో (Big Bash League) భాగంగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు వారు మైదానానికి చేరుకునే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా సెలబ్రిటీలు.. తాము ప్రయాణిస్తున్న వాహనం సడెన్ గా ఆగిపోతే.. ప్రత్యామ్నాయంగా వేరే కారులో తమ గమ్యానికి చేరుతుంటారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం రోడ్డుపై ట్యాక్సీని నెట్టారు. మ్యాచ్ కోసం వారు చేసిన ఈ సాహసం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బిగ్‌బాష్‌లీగ్‌లో (Big Bash League) భాగంగా పెర్త్ స్కార్చర్స్ తరఫున సిడ్నీ థండర్స్‌తో మంగళవారం ఆస్ట్రేలియా క్రికెటర్లు అస్టన్ అగర్( Ashton Agar), అరోన్ హర్డీ తలపడ్డారు. ఈ మ్యాచ్‌కు ముందు వారు మైదానానికి చేరుకునే క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఉబర్ కారు సడెన్ గా రోడ్డుపై ఆగింది. దీంతో మ్యాచ్ కి టైమ్ అవుతుండటంతో వారే కారును తోసుకుంటూ స్టేడియానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సంఘటన.. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్(Perth Scorchers VS Sydney Thunder) ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ ప్రసార సమయంలో హాట్ టాపిక్ అయింది. ‘మా వీక్షకుల్లో ఒకరు మాకు సందేశం పంపారు. మీరు ఈ రోజు చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మైదానంలోకి వచ్చారని పేర్కొన్నారు. ఇది నిజమేనా?’ కామెంటేటర్స్ లారీ ఎవాన్స్‌ను సరదాగా అడిగారు. తన ఇయర్‌పీస్‌ను కనెక్ట్ చేసి ఫీల్డింగ్ చేస్తున్న ఎవాన్స్ పలు విషయాలను వెల్లడించాడు. మ్యాచ్ కు హాజరయ్యేందుకు తాము ఉబర్ తీసుకున్నామని, కానీ దురదృష్టవశాత్తూ అది సడెన్ గా అగిపోయి.. ముందుకు వెళ్లలేదన్నాడు. దీంతో తామే స్వయంగా ఆ కారును రోడ్డు పక్కకు నెట్టాల్సి వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా.. నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ అంటే ఎంత ఇష్టామో అంటూ పలువురు నెటిజన్లు ఆస్ట్రేలియా ప్లేయర్లను ప్రశంసించారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పెర్త్ స్కార్చర్స్(Perth Scorchers), సిడ్నీ థండర్‌ను 71 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. కెప్టెన్ టర్నర్ 41 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన థండర్ జట్టు 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. థండర్ బ్యాటర్లలో మ్యాథ్యువ్ 33, డేవిడ్ వార్నర్ 25 పరుగులు చేశారు.
ఇవీ చదవండి:
Chris Lynn: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
Virat Kohli: 2026 కొత్త ఏడాది వేళ.. విరాట్ ఎమోషనల్ పోస్ట్..