Share News

New Year Google Doodle: ఈ ఏడాదిని ఇలా మొదలెట్టండి.. డూడుల్‌తో గూగుల్ సూచన

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:05 PM

ప్రపంచవ్యాప్తంగా జనాలు కోటి ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. వారి మనోభావాలకు అద్దం పట్టేలా ఉన్న నేటి గూగుల్ డూడుల్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

New Year Google Doodle: ఈ ఏడాదిని ఇలా మొదలెట్టండి.. డూడుల్‌తో గూగుల్ సూచన
Google Doodle 2026

ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం మొదలైంది. పాత పద్ధతులను మార్చుకుని తమ జీవితాన్ని కొత్త పథంలో నడిపించేందుకు అనేక మంది రెడీ అయిపోయారు. ఈ స్ఫూర్తికి అద్దం పట్టేలా గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో సిద్ధమైంది. కొత్త ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు, పట్టుదల వంటి వాటిని ప్రతిబింబిస్తూ డూడుల్‌ను రూపొందించింది (New Year 2026 Google Doodle).

ఈ డూడుల్‌లో మొదట గూగుల్ పదాలపై 2026 అని రాసున్న డైరీ, ఆ పక్కనే కాఫీ కప్పు పెన్ను కనిపిస్తాయి. కొత్త ఏడాదిని ప్రారంభించే ముందు క్షణకాలం ఆగి సేద తీరాలని, మనసులోని భావాలను అక్షరం రూపం ఇవ్వాలని అనుకునే వారికి ఇది సంకేతం. మరుక్షణమే ఈ దృశ్యం మారిపోయి వాటి స్థానంలో ఒక డంబెల్, స్కప్పింగ్ తాడు కనిపిస్తాయి. ఈ ఏడాది ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి దేహదారుఢ్యాన్ని మెరుగుపరుచుకునే వారికి ప్రతిబింబంగా ఇది నిలుస్తుంది. ఆ తరువాత ఈ సీన్ కాస్తా వంటకాలు, షెఫ్ ధరించే టోపీ ఉన్న చిత్రంగా మారితోంది. అంటే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మళ్లాలనేందుకు ఇది సంకేతం. చివరకు ఉన్ని తాడు బంతి, సూదులు కనిపిస్తాయి. అంటే.. ఇది కొత్తగా ఏదైనా సృజనాత్మకంగా ఈ ఏడాది మొదలెడదామని భావించే వారికి ఇది సంకేతం.


ఈ ఏడాది ప్రారంభించే ముందు క్షణకాలం కాస్త నెమ్మదించి ఒక్కసారి పరిస్థితులను బేరీజు వేసుకున్నాక ఉత్సాహంతో ముందడుగు వేయాలని సూచించేలా గూగుల్ ఈ డూడుల్‌ను డిజైన్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆశలు, లక్ష్యాలను ప్రతిబింబంగా దీన్ని రూపొందించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముఖ్యమైన సందర్భానికి అద్దం పట్టేలా గూగుల్ ఈ డూడుల్స్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ఆయా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. మరికొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ అందుబాటులో ఉంటాయి. ఇక దేశాల వారీగా ఏయే గూగుల్ డూడుల్స్ హల్ చేస్తున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేక డూడుల్ పేజీ కూడా ఉంది. మరీ ఆ పేజీపై ఓ లుక్కేసి వివిధ దేశాల్లో ఆయా రోజులకు ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.


ఇవీ చదవండి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూఇయర్ వేడుక.. ఏకంగా 16 సార్లు..

ఎలాంటి కాలం దాపురించిందో! ఈ యువతి పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Updated Date - Jan 01 , 2026 | 01:12 PM