Saravana Bhavan Old Bill: 2009 నాటి ఈ హోటల్ బిల్లు చూస్తే కన్నీళ్లు ఆగవు.. జస్ట్ రెండు ఇడ్లీలు..
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:41 PM
శరవణ భవన్‌కు చెందిన 2009 నాటి హోటల్ బిల్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి రేట్స్ చూసి జనాలు నోరెళ్ల బెడుతున్నారు. పాత రోజులను గుర్తు చేసుకున్ని కొన్ని ఎమోషనల్ కూడా అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పాత జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు వెనకటి కాలంలోకి వెళ్లిపోతుంది. ఆ పాత మధురాలన్నీ మనసులో సినిమాలా మెదులుతాయి. ప్రస్తుతం ఓ హోటల్ బిల్లు ఇలాగే జనాలతో టైమ్ ట్రావెల్ చేయిస్తోంది. నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటే కన్నీళ్లు కూడా ఆగట్లేదని కామెంట్ చేశారంటే భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా ఉంది (Old Saravana Bhavan Hotel Bill Goes Viral).
శరవణ భవన్ ఎంతటి ఐకానిక్ హోటలో అందరికీ తెలిసిందే. యావత్ దేశానికి ఈ హోటల్ గురించి తెలుసు. అయితే, 2009 నాటి శరవణ భవన్ హోటల్ బిల్లును ఓ వ్యక్తి నెట్టింట అప్‌లోడ్ చేశారు. అందులోని రేట్స్ చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. తమకు పాత రోజులు గుర్తొచ్చాయని అన్నారు. రెండు ఇడ్లీలు (రూ.14.50), సైడ్ డిషెస్‌తో కూడిన చపాతీ (రూ.26.00), మినీ స్పెషల్ ప్యూర్ ఫిల్టర్ కాఫీకి (రూ.8.63) సంబంధించిన బిల్లు ఇది. మొత్తం కలిపితే రూ.50.25.
ఈ ధరలు చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు దశాబ్దాల్లో రేట్స్ ఎంతలా పెరిగాయో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో లైఫ్ చాలా సింపుల్‌గా ఉండేదని, నాటి రోజులు, ఆ రేట్స్ గుర్తు చేసుకుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయని కొందరు కామెంట్ చేశారు. నేటి రేట్స్, ఆన్‌లైన్ డెలివరీలు, ప్లాట్ ఫామ్, కన్వీనియంట్ ఫీజుల పేరిట వసూళ్ల పర్వం చూస్తుంటే గుండె జారిపోతోందని అన్నారు. మరికొందరు మాత్రం కాస్త భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నాటి ప్రామాణిక ధరల ప్రకారం చూసినా శరవణ భవన్ బిల్లులో రేట్స్ ఎక్కువేనని అన్నారు.
మరికొందరేమో చర్చను బిల్లుపై ఉన్న ఇంక్‌వైపు మళ్లించారు. ఇన్నేళ్ల పాటు ఇంక్ చెరిగిపోకుండా ఉండటం ఆశ్చర్యకరమేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇలాంటి బిల్లుల కోసం థర్మల్ ఇంక్‌ను వాడుతున్నారని, బిల్లును ముద్రించిన వారంలోపే ఇంక్ మొత్తం చెరిగిపోతుందని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి
ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు
కిడ్నీలను టచ్ చేసిందిగా.. పాక్ మహిళా ఆఫీసర్‌పై ట్రోలింగ్