Pak Cop Viral Video: కిడ్నీలను టచ్ చేసిందిగా.. పాక్ మహిళా ఆఫీసర్‌పై ట్రోలింగ్
ABN , Publish Date - Dec 29 , 2025 | 07:45 AM
పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఓ పాకిస్థానీ మహిళా ఏఎస్పీపై ప్రస్తుతం ట్రోలింగ్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. కిడ్నీలను టచ్ చేసే యాక్టింగ్ అంటూ జనాలు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించడం మంచిదే కానీ జనాల మెప్పు కోసం అతిగా ఆరాటపడితే మాత్రం నవ్వుల పాలు కావాల్సిందే. ఈ కఠిన సత్యాన్ని స్వానుభవంతో తెలుసుకుందో పాకిస్థానీ మహిళా పోలీసు ఆఫీసర్. ప్రస్తుతం ఆమెపై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అబ్బ.. యాక్టింగ్‌తో కిడ్నీలను టచ్ చేసిందంటూ అనేక మంది సెటైర్లు పేలుస్తున్నారు (Pakistani Female ACP Trolled Online).
లాహోర్‌కు చెందిన మహిళా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షెహర్‌బానో నఖ్వీ ఇటీవల ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్నారు. అయితే, ఇంటర్వ్యూ సందర్భంగా స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లారు. గంట తరువాత తిరిగొచ్చి మర్డర్ కేసు పరిష్కరించామని చెప్పారు. ఇదంతా కాస్త నాటకీయంగా ఉండటంతో విమర్శలు పెరిగాయి. పాడ్ కాస్ట్ కొనసాగుతుండగా నఖ్వీకి ఎస్‌హెచ్ఓ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఒక్క నిమిషం.. నాకు ఎస్‌హెచ్ఓ నుంచి కాల్ వస్తోంది. ఆ ఖుర్రమ్ చెప్పు. ఏంటి.. నిందితుడు దొరికిపోయాడా! వెరీ గుడ్.. నేను వస్తున్నా ఉండు’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ‘ఒక మర్డర్ జరిగిందట. విషయం ఏంటో తెలుసుకుని వస్తా’ అని పాడ్ కాస్టర్‌కు చెప్పి ఆమె వెళ్లిపోయారు.
గంట తరువాత తిరిగొచ్చిన ఆమె జరిగిందేంటో పాడ్‌కాస్ట్ వ్యాఖ్యాతకు వివరించారు. మర్డర్ జరిగినట్టు తెలిపారు. ‘ఓ వ్యక్తి ఫ్రస్ట్రేషన్‌లో తన ఫ్రెండ్‌ను హత్య చేశాడు. అప్పు తీర్చమన్నందుకు ఇలా చేశాడు. పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద బందీగా ఉన్న చిన్నారిని విడిపించాము’ అని నఖ్వీ తెలిపారు.
వీడియో వైరల్ కావడంతో ట్రోలింగ్ విపరీతంగా జరిగింది. ‘ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారో గానీ.. యాక్టింగ్ మాత్రం కిడ్నీలను టచ్ చేసిందిగా’ అని ఒక వ్యక్తి ఎద్దేవా చేశారు. ‘ఏంటి.. అంతా ఒక గంటలో అయిపోయిందా? ఈమె వెనక్కు కూడా రాగలిగిందా?’ ఇదంతా నమ్మశక్యంగా లేదు’ అని మరో వ్యక్తి అన్నారు. అయితే, గతేడాది ఓ మహిళను కాపాడినందుకు నఖ్వీపై ప్రశంసలు కురిశాయి. బాధిత మహిళ కుర్తాపై అరబిక్ అక్షరాలను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు ఆమె దైవదూషణ చేసిందని ఆరోపించారు. వెంటనే నఖ్వీ జోక్యం చేసుకుని ఆమెపై దాడి జరగకుండా కాపాడింది.
ఇవీ చదవండి
ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..
ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు