UP Woman: ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:29 AM
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ యువకుడి మోజులో పడ్డ వివాహిత తన ఐదుగురు పిల్లలను కాదనుకుని అతడితో వెళ్లిపోయింది. తల్లి జాడ తెలియక పిల్లలు తల్లడిల్లుతున్న వైనం స్థానికులతో కంటతడి పెట్టిస్తోంది. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో విలువలు నానాటికీ పతనం అవుతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. చివరకు పేగుబంధాన్ని కూడా కాలదన్నుకునే స్థితికి వ్యక్తులు చేరుకుంటున్నారు. తాజాగా యూపీలో ఇలాంటి దారుణం వెలుగు చూసింది. ఐదుగురు పిల్లలున్న ఓ వివాహిత కన్న బిడ్డలను ఒంటరులను చేసి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. తల్లి ఎక్కడికి వెళ్లిందో, ఎప్పుడు వస్తుందో, అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం చేసుకోలేని ఆ పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి (UP Married Woman Elopes With Lover).
మెయిన్‌పురీ నగరం కాషీరామ్ కాలనీకి చెందిన సంగీత అనే మహిళకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ట్రక్ డ్రైవర్‌గా చేస్తుంటాడు. వారికి ఐదుగురు సంతానం. సంగీత భర్త విధుల నిమిత్తం ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో సంగీతకు కాన్‌పూర్‌కు చెందిన ఓ యువకుడితో పరిచయమైంది (Mother of Five Abandons Children).
ఆ పరిచయం చివరకు వారి మధ్య సన్నిహిత సంబంధానికి దారి తీసింది. యువకుడి మోజులో పడ్డ సంగీత తన పేగు బంధాన్ని కూడా కాలదన్నుకుంది. ఇటీవల ఒక రోజు భర్త లేని సమయంలో పిల్లలను ఇంట్లోనే వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లోని బంగారం, వెండి నగలను కూడా తీసుకెళ్లింది. అప్పు కింద తీసుకున్న రూ.70 వేల మొత్తాన్ని కూడా ఆమె తీసుకెళ్లింది.
భార్య చేసిన మోసం, పిల్లలు ఒంటరిగా మారడం చూసి ఆ భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. తన చిన్న కూతురి వయసు కేవలం రెండేళ్లని, తల్లి కోసం రోదిస్తున్న ఆమెను ఊరడించడం ఎవరి వల్లా కావట్లేదని అన్నాడు. తల్లి జాడ కానరాక పిల్లలందరూ తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించాడు. కన్న తల్లే పిల్లల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోవడంతో స్థానికంగా ఈ ఘటన కలకలానికి దారి తీసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..
Madras High Court: 16 ఏళ్లలోపు వారికి ఇంటర్నెట్ నిషేధం