Share News

Coporate Mazdoor: ఎలాంటి కాలం దాపురించిందో! ఈ యువతి పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:45 PM

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఓ యువతి ఆఫీస్‌ మీటింగ్‌‌కు అటెండ్ అయిన వైనం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Coporate Mazdoor: ఎలాంటి కాలం దాపురించిందో! ఈ యువతి పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Corporate Life

ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ అంటే జీతాలు.. వీకెండ్ టూర్స్.. కెరీర్‌లో ఉన్నతస్థితికి చేరేందుకు తగిన అవకాశాలు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే, నాణేనికి ఒకవైపు మాత్రమే. కార్పొరేట్ ఉద్యోగుల్లో కొందరికి తమ జీవితం మొత్తాన్ని పనికే అంకితం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జాబ్‌లో ఒత్తిడులు, బాధ్యతలు క్షణం తీరిక కూడా లేకుండా చేస్తాయి. ఇలాంటి ఓ యువతి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోపై ఓ రేంజ్‌లో కామెంట్ చేస్తూ కార్పొరేట్ కూలీ జీవితం ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు కనిపిస్తున్న ఓ యువతి లాప్‌టాప్‌తో బిజీబిజీగా కనిపించింది. ఏదో మీటింగ్‌కు హాజరవుతున్నట్టు ఆమె వాలకం ఉంది. చేతికి బ్యాండేజ్‌లు వంటివి స్పష్టంగా కనిపించాయి. సాలైన్‌లను కూడా ఉన్నాయి. అయితే, మహిళ మాత్రం ఇదంతా సాధారణమన్నట్టు కనిపించింది. తన పనిలో నిమగ్నమైపోయింది.


ఇక వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అనేక మంది యువతి పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో పరిస్థితి విషపూరితంగా ఉంటుందని అన్నారు. పని ఒత్తిడి పతాకస్థాయిలో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందని చెప్పారు. యువతి తనకేమీ పట్టనట్టు పనిలో మునిగిపోవడం కూడా కొందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోపై సెటైర్లు కూడా ఓ రేంజ్‌లో పేలాయి. ‘ఆమెను చూస్తుంటే తాను కార్పొరేట్ ఉద్యోగిని అన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు ఉంది’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘ఓకే ఆరోగ్యం బానే ఉందిగా.. ఇక పనిలోకి దిగు.. అని మేనేజర్ అన్నట్టు ఉన్నాడు’ అని మరో వ్యక్తి జోక్ చేశారు. ‘అనారోగ్యంతో ఉన్నా ఆఫీసు ఫోన్‌లు, మెసేజీలకు స్పందిస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితే దాపురిస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ హడావుడిలో పడి వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి

2009 నాటి ఈ హోటల్ బిల్లు చూస్తే కన్నీళ్లు ఆగవు.. జస్ట్ రెండు ఇడ్లీలు..

కిడ్నీలను టచ్ చేసిందిగా.. పాక్ మహిళా ఆఫీసర్‌పై ట్రోలింగ్

Updated Date - Jan 01 , 2026 | 07:19 AM