Chris Lynn: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:41 AM
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్ 2025-26)లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బ్రిస్బేన్ హీట్‌తో నిన్న (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు . అతడు అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ క్రిస్ లిన్(Chris Lynn) సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్ 2025-26)లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బ్రిస్బేన్ హీట్‌తో నిన్న (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు . అతడు అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్(Big Bash League) 2025-26 సీజన్ లో జరిగిన 17వ మ్యాచ్ లో క్రిస్ లిన్ ఈ మైలు రాయి అందుకున్నాడు. బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసిన లిన్ నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో లిన్ 4000 వేల పరుగుల చారిత్రక మైలురాయిని అందుకోవడంతో పాటు అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బిగ్ బాష్ లీగ్ కెరీర్‌లో 129 ఇన్నింగ్స్‌లు ఆడిన లిన్ 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 32 అర్ద శతకలు, ఒక సెంచరీ సాయంతో 4065 పరుగులు చేశాడు.
మొత్తంగా టీ20 కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన లిన్(Chris Lynn) 8636 పరుగులు చేశాడు. అందులో 57 అర్ద సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి. పవర్ హిట్టర్‌గా పేరున్న లిన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా మెరుపులు మెరిపించాడు. ప్రారంభంలో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడాడు. 2012-21 మధ్యలో 42 మ్యాచ్‌లు ఆడి 140.6 స్ట్రయిక్‌రేట్‌తో 10 అర్ద సెంచరీల సాయంతో 1329 పరుగులు చేశాడు.
ఇక బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ చేసిన బ్రిస్బేన్ 19.4 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. అడిలైడ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3, లియామ్ స్కాట్ 2, హసన్ అలీ 2, లూక్ వుడ్ 1, మాథ్యూ షార్ట్ 1 వికెట్ సాధిచారు. హీట్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్ ఆటగాడు కుహ్నేమన్ (31 నాటౌట) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన అడిలైడ్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్రిస్ లిన్(Chris Lynn) (79 నాటౌట్) మెరుపు అర్ద శతకంతో అడిలైడ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!